Revanth Reddy Munugodu By-Election : మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై జరగకుండా వ్యక్తిగత దూషణలపై చర్చ జరగడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలపై జరుగుతోందని చెప్పారు.

Revanth Reddy Munugodu By-Election : మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Comments Munugodu By-Election

Updated On : August 14, 2022 / 3:32 PM IST

Revanth Reddy Munugodu By-Election : మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నిక చర్చ తప్పుడు దారిలో పోతోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై జరగకుండా వ్యక్తిగత దూషణలపై చర్చ జరగడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలపై జరుగుతోందని చెప్పారు.

సమస్యలపై చర్చ జరుగకుంటే మునుగోడు ప్రజలు నష్టపోతారని వెల్లడించారు. మరోసారి మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్.. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలపై ఈ ఎన్నికల్లో చర్చ జరగాలన్నారు.

Revanth Reddy: పార్టీలు వేరైనా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే:రేవంత్ రెడ్డి

SLBC, బ్రాహ్మణవెల్లి ప్రాజెక్ట్‌లకు ఎన్ని నిధులిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు అభివృద్ధికి కేంద్రం రూ.5వేల కోట్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ పోరాటానికి లెఫ్ట్ పార్టీలు, కోదండరాం మద్దతివ్వాలని రేవంత్ కోరారు.