వింటేజ్ పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ లొకేషన్ పిక్స్ వైరల్..

వింటేజ్ పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ లొకేషన్ పిక్స్ వైరల్..

Updated On : December 17, 2020 / 3:25 PM IST

PowerStar: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా లొకేషన్‌లో తీసిన పవన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..PK‘వకీల్ సాబ్’ షూటింగ్ నిజాం కళాశాలలో జరిగింది. నిజాం కళాశాలలో పవన్ ఉన్నట్టు తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో లొకేషన్‌కు చేరుకున్నారు. దీంతో వారందరికీ అభివాదం చేశారు పవన్.. వారిలో కొందరితో ఫొటోలు కూడా దిగారాయన. ఈ ఫొటోల్లో పవన్ గెడ్డం లేకుండా గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తమన్ సంగీతమందిస్తున్నారు.Vakeel Saab

Vakeel Saab