ICC Men’s Player of the Month: ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్-2022 అక్టోబర్’గా నిలిచాడు. ఈ అవార్డు కోసం ఐసీసీ ఇటీవల ముగ్గురి పేర్లను ప్రకటించింది. వారిలో కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా ఉన్నారు. ఈ అవార్డుకు విరాట్ కోహ్లీ నామినేట్ కావడం ఇదే తొలిసారి.

ICC Men’s Player of the Month: ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా విరాట్ కోహ్లీ

Virat Kohli

Updated On : November 7, 2022 / 3:26 PM IST

ICC Men’s Player of the Month: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్-2022 అక్టోబర్’గా నిలిచాడు. ఈ అవార్డు కోసం ఐసీసీ ఇటీవల ముగ్గురి పేర్లను ప్రకటించింది. వారిలో కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా ఉన్నారు. ఈ అవార్డుకు విరాట్ కోహ్లీ నామినేట్ కావడం ఇదే తొలిసారి.

కోహ్లీ నామినేట్ అయిన తొలిసారే అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ‘‘పొట్టి క్రికెట్లో అద్భుతమైన రీతిలో ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఈ అవార్డు దక్కింది’’ అని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్‌మన్ గా విరాట్ కోహ్లీ (246 పరుగులు) కొనసాగుతున్నాడు.

అంతేగాక, టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ ఇటీవలే రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ కంటే ముందు వరకు ఫాంలేమితో బాధపడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఇప్పుడు తిరిగి ఫాంలోకి వచ్చి తనదైన శైలిలో ఆడుతున్నాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..