DSP passes away : కరోనా వైరస్ సోకి డీఎస్పీ కన్నుమూత
సామాన్యులు మొదలు పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఇదే పరిస్ధితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుమూశారు.

Dsp Passes Away Coron
Vizianagaram DSP passes away, due to corona : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా పాజిటివ్ రావటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
సామాన్యులు మొదలు పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఇదే పరిస్ధితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుమూశారు.
విజయనగరం సీసీఎస్ డీఎస్పీగా పనిచేసే జుత్తు పాపారావుకు ఇటీవల కరోనా సోకింది. దాంతో ఆయన విశాఖపట్నంలోని శ్రద్ధ ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ఆయన భార్య పిల్లలకు కూడా కరోనా సోకింది. భార్య ఆయనతో పాటే శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారి ఇద్దరు పిల్లలు కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.1991 బ్యాచ్ ఎసై గా విధులలో చేరిన జుత్తు పాపారావు విశాఖలో ఎసై గా, సిఐ గా వివిధ స్టేషన్స్ లో పనిచేసి మహిళా పోలీస్ స్టేషన్ ఎ సి పి గా విధులు నిర్వర్తించారు.