బాలీవుడ్‌లో బందుప్రీతి… స్టార్ కిడ్స్‌పై పేరడీ సాంగ్ వైరల్!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులే రాజ్యమేలుతున్నారనే వాదన వినిపిస్తోంది. బడా స్టార్ల సపోర్టుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించినా తర్వాతి సినిమాల్లో ఫ్లాప్ దెబ్బ పడితే ఇంటి ముఖం పట్టాల్సిందే. టాలెంట్ ఉన్నా బయట వాళ్లకు సినీ పరిశ్రమలో అంత తొందరగా ఎంట్రీ దొరకదు. అలాంటి వారివైపు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి ఉంటుంది. స్టార్ కిడ్స్ అయితే మాత్రం.. ఆడిషన్స్ దగ్గర నుంచే రెడ్ కార్పెట్‌తో వెల్ కమ్ చెప్పేస్తారు. ఒక్క సినిమా కూడా చేయకుండానే వారికి ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన నిర్మాతలు ముందుకు వస్తుంటారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పక్షపాత ధోరణిపై చాలా మంది గట్టిగానే తమ గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సలీల్ జమ్దార్ సినీ పరిశ్రమపై చేసిన ‘జింగాత్ ధడక్’ అనే పేరడీ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. 2018లో ఈ పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య జరిగిన పరిణామాలతో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఆడిషన్స్ దగ్గర నుంచి సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చక్కగా చూపించారు. బాలీవుడ్‌లో బంధుప్రీతిపై తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.