Alasandalu : రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించే అలసందలు

శరీరంలో హానికారక టాక్సిన్స్ ను నియంత్రిస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ కె నరాలకు బలాన్నిస్తుంది.

Alasandalu : రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించే అలసందలు

Alasandalu

Updated On : January 31, 2022 / 4:51 PM IST

Alasandalu : అలసందల్లో అమోఘమైన పోషక విలువలు ఉన్నాయి. అలసందలను బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. నవధాన్యాలలో ఒకటి. అలసందలను ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.వీటిలో పీచుపదార్ధం అధికంగా ఉండటం వల్ల జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచే శక్తి అలసందలకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల వ్యాదులు వ్యాప్తి చెందకుండా నిరోధించటంలో సహాయపడతాయి.

శరీరంలో హానికారక టాక్సిన్స్ ను నియంత్రిస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ కె నరాలకు బలాన్నిస్తుంది. ఐరన్ , మెగ్నీషియం, ఎనర్జీ లెవల్స్ పెరిగేలా చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో అలసందలు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతుంది. శరీరంలో కొవ్వు కరగాలనుకుంటే రోజుకో కప్పు ఉడకబెట్టిన అలసందలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మధుమేహంతో బాధపడేవారికి అలసందలు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. వీటిని తినటం వల్ల ఎక్కవ సేపు కడుపులో ఆకలి వేయకుండా ఉంటుంది. లావుగా ఉన్నవారు సన్నబడేందుకు చక్కని ఆహారంగా చెప్పవచ్చు. అలసందల్లో తక్కువ క్యాలరీలు, తక్కువ ఫ్యాట్ ఉంటుంది. వైరల్ ఫీవర్, జలుబు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.