White Hair : పిల్లల్లో తెల్లజుట్టా…. అయితే ఇలా చేయండి
కొబ్బరినూనెలో కరివేపాకు, ఆ ఆకులునల్లబడేదాకామరిగించాలి. ఇప్పుడు ఆ ఆకుల్ని వడకట్టి నూనెనుమాడుకు, జుట్టుకు మర్దన చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. జుట్టు తెల్లబడటం తగ్గే అవకాశం ఉంటుంది.

White hair in children
White Hair : నాలుగు పదుల వయసులో తెల్ల జుట్టు రావడం సర్వసాధారణం. కొందరిలో ముప్పయిలలోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. వంశపారంపర్య కారణాలే కాకుండా కొన్నిసార్లు పోషకాహార సమస్యలు కూడా ఇందుకు కారణమవుతాయి. అయితే యువతలో, ఇంకా పెద్దవయసు వాళ్లలో జుట్టు తెల్లబడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లల్లో కూడా జుట్టు తెల్లబడటం కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలు ట్రై చేయండి. అయినా ఫలితం లేదంటే మాత్రం డాక్టర్ ని కలవాల్సిందే.
READ ALSO : Overeating : అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి ఉపశమనం కోసం !
మన జుట్టు నల్లగా ఉండటానికి కారణం దానిలో ఉండే మెలనిన్ అనే పదార్థం. మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు ఆధారపడి ఉంటుంది. ఇది తక్కువ స్థాయిలో ఉంటే వెంట్రుకలు బూడిద రంగులో ఉంటాయి. మెలనిన్ పూర్తిగా లేకుండా పోయినప్పుడు జుట్టు తెల్లబడిపోతుంది. అతి చిన్న వయసులోనే చిన్నారుల్లో జుట్టు తెల్లబడుతున్నదంటే దాని వెనుక ఇతర ఆరోగ్య సమస్య ఏదైనా ఉండవచ్చు.
థైరాయిడ్
థైరాయిడ్ సమస్య పిల్లల్లో కూడా వస్తుంది. దీని వల్ల జుట్టు తెల్లబడటమే కాకుండా బలహీనమై రాలిపోతుంది. ఇకపోతే, తెల్ల జుట్టుకూ, చుండ్రుకూ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్ట చుండ్రుతో బాధపడే పిల్లల్లో జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ. ఇలాంటప్పుడు ముందు చుండ్రు తగ్గించే ప్రయత్నం చేయాలి. చుండ్రు ఉన్న పిల్లలకు జుట్టు జిడ్డు పట్టకుండా చూసుకోవాలి. నూనె రాయకూడదు. రాసినా, తలస్నానం చేసే ముందర ఒక అరగంట ముందు రాసి, తరువాత తలస్నానం చేయించాలి. డాక్టర్ ని సంప్రదించి చుండ్రు కు చికిత్స తీసుకోవాలి.
READ ALSO : Oath on Bhagavad Gita : కోర్టులో నిజంగా భగవద్గీతపై ప్రమాణం చేయిస్తారా?
పోషకాహారలేమి
వంశపారంపర్యంగా కూడా కొందరిలో తొందరగా జుట్టు తెల్లబడిపోతుంది. ఇలాంటప్పుడు ఏమీ చేయలేం. ఇకపోతేకొంతమందిలో పోషకాహార లోపం జుట్టు బలహీనం కావడానికైనా, తెల్లబడటానికైనా కారణమవుతుంది. ముఖ్యంగా బి12, జింక్, విటమిన్ డి లోపాల వల్ల జుట్టు తెల్లబడొచ్చు. రక్తహీనత సమస్య కూడా గ్రే హెయిర్ కి కారణమవుతుంది.
మానసిక సమస్యలు
ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలతో బాధపడే పిల్లల్లో కూడా జుట్టు తొందరగా తెల్లబడుతుంది. ఇందులో నుంచి బయటపడినప్పుడు సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ఇలాంటి ఆరోగ్య సమస్యలు తెల్లజుట్టుకు కారణం కాదని తెలిస్తే అప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. అప్పుడప్పుడే జుట్టు నలుపు రంగు మారుతున్నదనే దశలో ఇంట్లోనే కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించి చూడవచ్చు.
READ ALSO : Pandem Kodi : పందెం కోడికోసం థాయిలాండ్ నుంచి రంగాపురానికొచ్చారు..! యాజమాని ససేమిరా అనడంతో..
కరివేపాకు:
కొబ్బరినూనెలో కరివేపాకు, ఆ ఆకులునల్లబడేదాకామరిగించాలి. ఇప్పుడు ఆ ఆకుల్ని వడకట్టి నూనెనుమాడుకు, జుట్టుకు మర్దన చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. జుట్టు తెల్లబడటం తగ్గే అవకాశం ఉంటుంది.
ఉసిరి:
కొబ్బరినూనెలో ఉసిరికాయ ముక్కలు వేసి మరిగించాలి. ఇది జుట్టు నల్లబడేలా చేసే సహజ సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది. లేదంటే ఉసిరికాయల్ని ముక్కలుగా చేసి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్లతో జుట్టు కడుక్కోవాలి.
READ ALSO : Odish : మహిళలు ముందుగా బస్సెక్కితే అపశకునం అట .. రవాణా సంస్థల తీరుపై ఆగ్రహం
ఉసిరి, బాదం నూనె:
బాదం, ఉసిరి నూనెల్ని కలిపి మాడుకు రాసుకోవాలి. రాత్రంతా తలకు ఉంచి ఉదయాన్నే తలస్నానం చేయించాలి. జుట్టు బలంగా మారడమే కాకుండా, తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది.
ఈ చిట్కాలు పాటిస్తుంటే క్రమంగా సమస్య తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే, జుట్టు తెల్లబడటానికి బలమైన కారణం ఏదైనా ఉన్నప్పుడు మాత్రం ఈ చిట్కాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.