Fitness Apps : ఫిట్‌నెస్ యాప్‌లతో.. ఇంట్లోనే కసరత్తులు
ఆన్‌లైన్ ఫిట్‌నెస్ యాప్‌లు అలాగే సెషన్‌లకు మారడం శాశ్వత మార్పుగా నిపుణులు పరిగణిస్తున్నారు.

Fitness Apps
Fitness Apps : గత రెండు సంవత్సరాల కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. చాలా మంది ఇంట్లోనే ఉండి సాధారణపరిస్ధితులను గడుపుతున్నారు. ఇంటి నుండే ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఇంటి నుండే ఉద్యోగ కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. వివాహాలను సైతం గ్రాండ్‌గా జరుపుకోవటం లేదు. పెళ్లికి దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. వీటన్నింటికీ కారణం గ్లోబల్ మహమ్మారి.. అదే కరోనా… ఇది మన దేశాన్నే కాదు, మొత్తం ప్రపంచాన్ని తాకింది. ప్రజలు, బహుళ జాతి పరిశ్రమలు ఇతర రంగాలలో డిజిటలైజేషన్ రెక్కలు విచ్చుకుంది. ప్రజలు చాలా సులభంగా ఇంటర్నెట్‌లో పరస్పరం సంభాషించుకోవటమే కాకుండా వారి దైనందిన కార్యకలాపాలను సులభంగా సాగిస్తున్నారు.
ఇందులో శుభవార్త ఏమిటంటే కోవిడ్ రాకతరువాత ఫిట్‌నెస్ పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇంటికే పరిమితమైన చాలా మంది ఊబకాయం, అధికబరువు బారిన పడ్డారు. అలాంటి వారు ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో వారి శక్తి సామర్ధ్యాలను మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం వివిధ రకాల ఫిట్ నెస్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. వర్చువల్ వర్కౌట్‌లు & యాప్ ఆధారిత ఫిట్‌నెస్ ట్రైనింగ్ సెషన్‌లో చాలా మంది వ్యక్తులు పాల్గొంటున్నారు. ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లతో పాటు తరగతులకు ఆన్ లైన్ లోనే హాజరవుతూ అభ్యసిస్తున్నారు.
ఆన్‌లైన్ ఫిట్‌నెస్ యాప్‌లు అలాగే సెషన్‌లకు మారడం శాశ్వత మార్పుగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫిట్ నెస్ పరిశ్రమకు 32బిలియన్ డాలర్ల ప్రయోజనం చేకూర్చేదిగా ఉంది. ఫిట్‌నెస్ యాప్ లు ఒక్కొక్కరికి వారికి తగినట్లుగా ఫిట్‌నెస్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. వ్యక్తిగతంగా వర్కవుట్ సెషన్‌లా కాకుండా, అవసరాలు మరియు విభిన్న వ్యక్తుల లక్ష్యాలను ఒకే వర్కౌట్ ప్లాన్ లో పొందుపరుస్తున్నారు. ఒక్కొక్కరి ఫిట్‌నెస్ లక్ష్యం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తాయి. విభిన్న వ్యక్తులు, విభిన్నశరీరాలను, సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఫిట్‌నెస్ యాప్‌లు డైట్ ప్లాన్‌లను అందించటంతోపాటు, వ్యక్తులు తమ ఫిట్‌నెస్ లక్ష్యాలను ఎప్పటికప్పుడు వీటిలో తెలుసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి.
ఫిట్‌నెస్ యాప్‌లు సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తున్నాయి. యాప్ నిర్వాహకులు తమ సబ్‌స్క్రైబర్లను సానుకూల అలవాట్లను పెంపొందించుకోవాలని ప్రోత్సహిస్తారు. అనేక మంది సబ్‌స్క్రైబర్‌లు వారి ఫిట్‌నెస్ ప్లాన్‌ను బట్టి ప్రతి రోజు అనేక రకాల పద్ధతుల్లో వర్చువల్ వర్కౌట్‌లలో భాగస్వాములవుతున్నారు. ఫిట్‌నెస్ యాప్‌లు ఫిట్‌నెస్ చార్ట్‌లతో పాటు జీవనశైలి పద్దతులను వివరిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్ స్థాయి , బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా ప్లాన్‌లను అందిస్తున్నాయి.
ఫిట్‌నెస్ యాప్‌లు జిమ్ లో ఏవిధంగా అయితే వ్యక్తిగత శిక్షకుడు సూచనలు ఇస్తాడో అలాగే ఫిట్‌నెస్ యాప్‌లు సాంకేతికతను ఉపయోగించి సూచనలు అందిస్తాయి. అలాగే గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు, వంటి వివరాలను ఈ యాప్ లద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించి మొబైల్ తోపాటు స్మార్ట్ గా ధరించగలిగే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ ల వల్ల చాలా మేర రోజు వారిగా ఫిట్ నెస్ కార్యకలాపాలు కొనసాగించేందుకు దోహదపడుతున్నాయనే చెప్పవచ్చు.