ట్రైల‌ర్ ఈవెంట్‌లో విశ్వ‌క్ సేన్‌కు 10టీవీ రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో స‌మాధానం ఇచ్చిన చిరంజీవి

ట్రైల‌ర్ ఈవెంట్‌లో విశ్వ‌క్ సేన్‌ ను 10టీవీ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి స‌మాధానం ఇచ్చారు.

ట్రైల‌ర్ ఈవెంట్‌లో విశ్వ‌క్ సేన్‌కు 10టీవీ రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో స‌మాధానం ఇచ్చిన చిరంజీవి

10TV reporter question to Vishwak Sen at the trailer event Chiranjeevi answered at the prerelease event

Updated On : February 10, 2025 / 2:28 PM IST

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ త్వ‌ర‌లోనే లైలా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా వ‌రుస ఈవెంట్స్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ట్రైల‌ర్ లాంచ్‌ ఈవెంట్‌లో విశ్వ‌క్ సేన్‌కు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. విశ్వ‌క్ ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌కు సంబంధించిన ఈవెంట్స్‌కు ఎక్కువ‌గా నంద‌మూరి హీరోలు ముఖ్య అతిథులు వ‌చ్చారు. ఈ విష‌యాన్నే 10 టీవీ సినిమా జ‌ర్న‌లిస్ట్ వెంక‌ట్ ప్ర‌స్తావించారు. “మీ ఈవెంట్స్‌కు ఎక్కువ‌గా నంద‌మూరి హీరోలు గెస్టులుగా వ‌స్తారు. మీరు నంద‌మూరి కాంపౌండ్ అని అంటారు. మ‌రి లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవిని గెస్ట్‌గా పిలిచారంట గ‌దా.” అని అడిగారు.

‘మాకు ఉన్న‌ది ఇంటి కాంపౌండ్ ఒక్క‌టే. ఇక్క‌డ ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టే. ఇండ‌స్ట్రీలో ఎలాంటి కాంపౌండ్ లేవు.’ అని విశ్వ‌క్ స‌మాధానం ఇచ్చారు. ఇక ఇదే ప్ర‌శ్న‌కు ఆదివారం నిర్వ‌హించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన చిరంజీవి స‌మాధానం ఇచ్చారు. త‌న‌కు ఈ ప్ర‌శ్న వేసిన జ‌ర్న‌లిస్ట్ ఎవ‌రో స‌రిగా గుర్తు లేద‌ని చెబుతూనే.. విశ్వ‌క్ చెప్పిన స‌మాధానం బాగుంద‌ని చెప్పారు.

BoycottLaila : 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్.. బాయ్ కాట్ లైలా ట్రెండింగ్… రంగంలోకి హీరో

‘విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి నువ్వు వెళ్తున్నావా.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ కాంపౌండ్.. అప్పుడప్పుడు తారక్ అంటాడు.. అంటూ కొన్ని మాటలు వినిపించాయి. నేను ఒకటే చెప్పా.. మనుషులన్నాక వేరే వాళ్ల మీద ప్రేమ, అభిమానం ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఫర్ ఎగ్జాంపుల్.. మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కు నేను వెళ్లకూడదా? వాడితో కలిసి ఉండకూడదా? కలిసి భోజనం చేయకూడదా? వాడిని నేను దూరంగా పెడతానా?.’ అని చిరంజీవి ప్ర‌శ్నించారు.

మొన్న విశ్వక్ సేన్ ని ఇలానే ఎవరో అడిగారని, అత‌డు కూడా చ‌క్క‌గా స‌మ‌ధానం చెప్పాడ‌న్నారు. ఆ క్లిప్ ను తాను చూసిన‌ట్లుగా చిరంజీవి చెప్పారు. ‘మీరు బాలృష్ణ కాంపౌండ్ కదా.. మెగా కాంపౌండ్ లోకి వెళ్తున్నారేంటి అని విశ్వ‌క్‌ను అడిగారు.. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని విశ్వక్ సేన్ చాలా చక్కగా చెప్పాడు. నా చిన్న‌నాటి రోజుల నుంచి ఆ కాంపౌండ్ల గోల ఉంది. కానీ అది షూటింగ్‌ల వరకే.. హీరోలంతా బాగానే ఉంటారు. కానీ అభిమానులే కొట్టుకు చచ్చే వాళ్లు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ.. మేమంతా కలుసుకుంటూనే ఉంటాం. అభిమానం అనేది పర్సనల్. మన మనిషి కాదని దూరం పెట్టడం కరెక్ట్ కాదు.’ అని చిరంజీవి తెలిపారు.

Thandel : దారుణం.. APSRTC బ‌స్‌లో తండేల్ సినిమా.. ఇంత అవమానిస్తారా..? బన్నీవాసు ఫుల్ సీరియస్

ఇక హీరో ఇమేజ్‌, ఫ్యాన్ బేస్ పెర‌గాలంటే.. అది చేసే సినిమా ఇస్తుంది త‌ప్ప‌.. మ‌నల్ని దూరం చేసుకోవ‌డం కాద‌న్నారు. అంద‌రూ క‌లిసిమెలిసి ఉండాల‌న్నారు. పుష్ప‌2 మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దానికి తాను ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లుగా చెప్పారు. ఇండ‌స్ట్రీలో ఒక సినిమా ఆడితే అంద‌రూ హ‌ర్షించాలి. ఓ సినిమా ఆడితే ఎంతో మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయ‌ని చిరంజీవి అన్నారు.