18 Pages: 18 పేజెస్ క్లైమాక్స్.. ఆడియెన్స్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందట!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

18 Pages: 18 పేజెస్ క్లైమాక్స్.. ఆడియెన్స్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందట!

18 Pages Movie To Have Unique Climax

Updated On : December 21, 2022 / 4:16 PM IST

18 Pages: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి.

18 Pages : ’18 పేజిస్’ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ ‘18 పేజెస్’ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ముఖ్యంగా ఈ క్లైమాక్స్‌ శుభం కార్డుతో కాకుండా ట్రాజెడీతో ముగుస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని.. వారు మునుపెన్నడూ చూడని క్లైమాక్స్‌ను ఈ సినిమాలో చూస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

18 Pages: 18 పేజెస్ ట్రైలర్.. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో వస్తున్న నిఖిల్, అనుపమ

అయితే ఈ సినిమాలో ముగింపు ప్రేక్షకులను ఏడిపించడం ఖాయమని నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆరేంజ్‌లో ట్రెజెడీగా ఉండబోతుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తుండగా, గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.