మీకు తెలుసా: మాస్ మహారాజా ఖరీదైన కార్లలో ఒకటి రూ.2కోట్లకు పైనే

మాస్ మహారాజా రవితేజ అంటే స్కీన్ మీదనే కాదు. సెట్‌లోనూ ఓ వైబ్రేషన్ ఎక్కడ లేని ఎనర్జీ అంతా ఆయన సొంతం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించాడు. 1990లో కర్తవ్యం సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి నాటి నుంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ వైవిధ్య పాత్రలతో అలరిస్తుంటాడు. ఇటీవల విడుదలైన రాజా ది గ్రేట్ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచి ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
మాస్ రాజాను 1999, 2002 సంవత్సరాలలో నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు వరించాయి. 2019 సంవత్సరంలో డిస్కో రాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ మహారాజా రవితేజ 51వ పుట్టిన రోజును జనవరి 27న అభిమానులు సంబరంలా జరుపుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో హిట్లు అంతంత మాత్రంగానే ఉన్నా.. ట్రాక్ రికార్డు మాత్రం ఔరా అనేలా ఉంటుంది. సినీ పరిశ్రమలోకి వచ్చి ఆయన సంపాదించిన ఆస్తుల విలువ రూ.76 కోట్లు. ఏటా రూ.8.9 కోట్ల చొప్పున ఆర్జిస్తున్నాడు. దాదాపు 60 సినిమాలకు పైగా నటించిన రవితేజ దగ్గర అత్యంత విలువైన లగ్జరీ కార్లు 3 ఉండగా అందులో ఒక దాని ఖరీదు అక్షరాల రూ.2.43 కోట్ల వరకూ ఉంటుంది.
1. రేంజ్ రోవర్ ఎవోక్ విలువ రూ.63.82 లక్షలు.
2. బీఎండబ్ల్యూ ఎం6 విలువ రూ.1.24 కోట్లు
3. మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ విలువ రూ.2.43 కోట్లు