ఇంత హాట్ యోగా ఎప్పుడైనా చూశారా!..

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్నారు. నచ్చిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు.
ఫిట్‌నెస్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్ అన్నిటినీ పిక్స్, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన యోగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చేసింది యోగానే కదా అందులో కొత్తేముంది అనుకోకండి. సదరు వీడియోలో యోగా వేర్‌లో ట్రైనర్ సాయంతో రకరకాల భంగిమల్లో ఆసనాలు వేస్తూ కుర్రకారుకి మతిపోగొడుతోంది ప్రగ్యా. దీంతో ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు స్క్రీన్ షాట్స్ తీసి మరీ పోస్టులు చేస్తున్నారు కుర్రాళ్లు. ‘జయ జానకి నాయక’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయని ప్రగ్యా త్వరలో తన కొత్త ప్రాజెక్ట్స్ గురించిన కబుర్లు చెబుతానంటోంది.
https://www.instagram.com/p/CDszXNRh78a/?utm_source=ig_web_copy_link