Rohini : అతను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండి.. తన లవ్ స్టోరీ చెప్తూ నటి రోహిణి ఎమోషనల్..

రోహిణి కూడా తన ప్రేమ కథ చెప్తూ..

Rohini : అతను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండి.. తన లవ్ స్టోరీ చెప్తూ నటి రోహిణి ఎమోషనల్..

Actress Rohini Tells about her First Love in Bigg Boss gets Emotional

Updated On : November 17, 2024 / 2:34 PM IST

Rohini : సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన రోహిణి ఆ తర్వాత జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్, జబర్దస్త్, టీవీ షోలతో బిజీగానే ఉండి. గతంలో ఓ సారి బిగ్ బాస్ కు రాగా ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చింది. బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్ ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది.

Also Read : Tasty Teja : తన పక్కన నేను బాగోలేనని వదిలేసింది.. తన లవ్ స్టోరీ చెప్పిన టేస్టీ తేజ.. వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా..

తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని మొదటి ప్రేమ కథల గురించి చెప్పుమనగా పలువురు కంటెస్టెంట్స్ తమ ప్రేమ కథలు చెప్పారు. ఈ క్రమంలో రోహిణి కూడా తన ప్రేమ కథ చెప్తూ.. నాకు బాగా దగ్గరైన ఓ స్నేహితుడికి డైమండ్ రింగ్ తో ప్రపోజ్ చేశాను. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి, అవి క్లియర్ అయ్యాక పెళ్లి చేసుకుందాము అన్నాడు. నేను కూడా అందుకు ఓకే చెప్పాను. కానీ వేరే అమ్మయితే రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. ఆ తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ ఎమోషనల్ అయింది. మరి రోహిణిని వదులుకున్న ఆ అబ్బాయి ఎవరో..