Roja : మళ్ళీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన నటి, మాజీ మంత్రి ‘రోజా’.. ఆ టీవీ షోలో.. ప్రోమో రిలీజ్..
గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ ని కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు, సినిమాలు చేయను, ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయింది.

Actress Roja Re Entry in TV Shows New Program Promo goes Viral
Roja : ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేసింది. ఆ షోతో పాటు మరిన్ని టీవీ షోలలో కూడా అప్పుడప్పుడు కనిపించి మెప్పించింది రోజా. అయితే రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు మానేసినా జబర్దస్త్ చేసింది.
గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ ని కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు, సినిమాలు చేయను, ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు టీవీ షోలకు రోజా దూరమైంది. అయితే గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడంతో పాటు ప్రభుత్వం కూడా మారడంతో ప్రస్తుతం రోజా అడపాదడపా మాత్రమే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతుంది.
తాజగా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రోజా సందడి చేసింది. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ షో మార్చ్ 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. షోకి రవి, అషురెడ్డి యాంకర్స్ గా చేయనున్నారు. మరో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం కాబట్టి, మళ్ళీ ఎన్నికల వరకు బిజీగా ఉండటానికి రోజా టీవీ షోలలోకి ఎంట్రీ ఇచ్చింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రోజా మళ్ళీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ షోలో టెంపరరీగా వచ్చిందా? మళ్ళీ ఎన్నికలు అయ్యేవరకు ఇదివరకులా టీవీ షోలలో కనిపిస్తుందా? మళ్ళీ జబర్దస్త్ కు కూడా రోజా వస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీరు కూడా రోజా రీ ఎంట్రీ ఇచ్చిన టీవీ షో ప్రోమో చూసేయండి..
జబర్దస్త్ లో నాగబాబు, రోజా వెళ్లిపోయిన తర్వాత ఎవరూ ఫిక్స్ జడ్జి లేరు, కొన్ని కొన్ని వారాలు ఒక్కొక్క సెలబ్రిటీ చేస్తున్నారు. నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు, ఆయన మళ్ళీ వచ్చేలా కనపడట్లేదు. ఇప్పుడు రోజా రీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి జబర్దస్త్ కి రోజాని తీసుకొస్తారా, మళ్ళీ ఒక ఫిక్స్ జడ్జి జబర్దస్త్ కి వస్తారా చూడాలి.