Love Story: లవ్ స్టోరీని దక్కించుకున్న ఆహా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడు కొత్త కొత్త సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా, త్వరలోనే ఆహా మరో బ్లాక్ బస్టర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది.

Love Story: లవ్ స్టోరీని దక్కించుకున్న ఆహా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Love Story

Updated On : October 11, 2021 / 9:10 AM IST

Love Story: ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడు కొత్త కొత్త సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా, త్వరలోనే ఆహా మరో బ్లాక్ బస్టర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవిల లవ్ స్టోరీ థియేటర్లలో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇంకా పలు చోట్ల హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండగానే నిర్మాతలు డిజిటల్ విడుదలకు హక్కులు ఇచ్చేశారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రముఖ ఓటిటి సంస్థ అయిన ఆహా వీడియోలో స్ట్రీమ్ కానుంది.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

సెప్టెంబర్ 24న థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లవ్ స్టోరీ ఇప్పటికే ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. డిమాండ్ ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి కనుక ఓటీటీ హక్కులను అమ్మేసినట్లుగా తెలుస్తుంది. అక్టోబర్ 22న ఆహాలో లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంలో ఆహా నుండి కానీ నిర్మాతల నుండి కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది.

Big Boss 5: ఒకవైపు ఫుల్‌ప్యాక్ ఎంటర్టైన్మెంట్.. మరోవైపు ఎలిమినేషన్ ఎమోషన్!

కరోనా భయం నుండి బయటపడలేని కొందరు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆహా ఈ ఏడాది భారీగా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు ప్లాన్స్ వేస్తుంది. ఇందులో భాగంగానే దసరా నుండి వచ్చే ఏడాది జనవరి వరకు 90 రోజుల పాటు ఇరవైకి పైగా సినిమాలను, కొత్త షోస్ కూడా ప్లాన్ చేస్తుండగా లవ్ స్టోరీ కూడా ఇందులో భాగమే కానుంది. మరి లవ్ స్టోరీ ఓటీటీ ఎలాంటి విజయం దక్కించుకుంటుందో చూడాలి.