Boomika : ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్..

సెలెక్టివ్‌‌గా సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్..

Boomika : ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్..

Boomika

Updated On : August 16, 2021 / 8:34 PM IST

Boomika: సెలెక్టివ్‌‌గా సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. ‘మిస్ మ్యాచ్’, ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీలో నటిస్తోంది ఐశ్యర్య. నాని ‘టక్ జగదీష్’, సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, తమిళ్, తెలుగులో తెరకెక్కుతున్న మలయాళీ సూపర్ హిట్ ‘ది గ్రేట్ ఇండియా కిచెన్’ రీమేక్‌లోనూ యాక్ట్ చేస్తోంది. అలాగే తమిళ్‌లో ‘డ్రైవర్ జమున’, ‘మోహన్ దాస్’ సినిమాలు చేస్తోంది.

Aishwarya Rajesh

ఐశ్యర్య ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ మూవీ ‘భూమిక’.. రతీంద్రన్ ఆర్. ప్రసాద్ డైరెక్ట్ చేశారు. పాపులర్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సమర్పిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడమే కాక ఫిలిం మీద అంచనాలు పెంచేసింది.

Chiranjeevi : ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో మీటింగ్..

రీసెంట్‌గా ‘భూమిక’ రెండో ట్రైలర్ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య మరోసారి తన నటనతో అలరించనుందని తెలుస్తోంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఆగస్టు 23 నుండి ‘భూమిక’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.