Allu Arjun: రప్పా రప్పా ఆడిస్తున్న అల్లు అర్జున్‌.. ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ ఇండియా మొట్టమొదటి ఎడిషన్‌లో బన్నీ ముఖచిత్రం చూశారా?

"మూవీకి హద్దులు ఏమీ ఉండవని నిరూపించిన స్టార్‌ అల్లు అర్జున్‌: ది రూల్‌" అనే పేరుతో ఆర్టికల్‌ రానుంది.

Allu Arjun: రప్పా రప్పా ఆడిస్తున్న అల్లు అర్జున్‌.. ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ ఇండియా మొట్టమొదటి ఎడిషన్‌లో బన్నీ ముఖచిత్రం చూశారా?

Updated On : February 20, 2025 / 3:21 PM IST

పుష్ప సినిమాతో రప్పా రప్పా రికార్డులను తిరగరాసిన యంగ్ హీరో అల్లు అర్జున్ పాపులారిటీ ఖండాంతరాలను దాటేస్తోంది. అప్పట్లో పుష్ప 1 రిలీజ్‌ తర్వాత ఇండియా టుడే మ్యాగజైన్‌పై అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ముద్రించిన విషయం తెలిసిందే.

ది సౌత్ స్వాగ్ అంటూ అప్పట్లో సౌత్ సినిమాలపై స్పెషల్ ఆర్టికల్ రాసి అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు పుష్ప 2తో మరింత క్రేజ్‌ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు కూడా సినిమా మ్యాగజైన్‌ ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ ఇండియా ఎడిషన్‌లో అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని ముద్రించారు.

ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా పేరుతో ఆ మ్యాగజైన్ భారత్‌లోనూ అడుగుపెట్టేసింది. ఇండియాలో ఆ మ్యాగజైన్‌ మొట్టమొదటి సంచికపై అల్లు అర్జున్‌ ముఖ చిత్రంతో వస్తుండడం గమనార్హం. ఇప్పటికే కవర్ పేజ్‌ ఫొటో షూట్‌ను పూర్తయింది.

“మూవీకి హద్దులు ఏమీ ఉండవని నిరూపించిన స్టార్‌ అల్లు అర్జున్‌: ది రూల్‌” అనే పేరుతో ఆర్టికల్‌ రానుంది. ఇందుకు సంబంధించిన బీటీఎస్‌ ప్రోమో వీడియోను సామాజిక మాధ్యమాల్లో కనపడుతోంది. ఇందులో అల్లు అర్జున్‌ పలు విషయాలను వెల్లడించారు.

ఇందులో బన్నీ మాట్లాడుతూ.. భారతీ బాక్సాఫీస్‌ వద్ద యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాననని అన్నారు. తన లైఫ్‌లో తనకు దక్కిన గొప్ప అవకాశం ఇదేనని తాను అనుకుంటన్నట్లు చెప్పారు. శక్తి, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయని, వాటిని ఎవరూ మన నుంచి దూరం చేయలేరని అన్నారు. మనిషికి పలు లక్షణాలు పుట్టుకతోనే వస్తాయని, ఇది కూడా అలాంటిదేనని తెలిపారు.

విజయం సాధించిన అనంతరం కూడా వినయంగా ఉండటం ముఖ్యమని చెప్పారు. లైఫ్‌లో విజయం సాధించాక సైతం గర్వం లేకుండా జీవిస్తున్న వారిని తాను చూశానని, వారి క్యారెక్టర్‌ మీద అది ఆధారపడి ఉంటుందని తెలిపారు. తాను నూరు శాతం సామాన్యుడినేనని అన్నారు. కాగా, గంగోత్రి సినిమా నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ దేశంలోనే గొప్ప స్టార్‌గా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శవంతమని ఫ్యాన్స్‌ ఈ ప్రోమో వీడియోపై స్పందిస్తున్నారు.

 

Allu Arjun Cover Feature on Film Magazine