Allu Arjun : ఈ సంవత్సరం బిగ్గెస్ట్ న్యూస్ మేకర్.. అల్లు అర్జున్.. పుష్ప 2 ప్రమోషన్స్ నుంచి సంధ్య థియేటర్ వివాదం వరకు..
కేవలం కలెక్షన్లతోనే కాదు కాంట్రవర్సీతో అంతకుమించిన న్యూస్ మేకర్ అయ్యాడు అల్లు అర్జున్.

Allu Arjun Became The Biggest News Maker of Tollywood in 2024
Allu Arjun : 2024.. ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలొచ్చినా ఎంతమంది స్టార్ హీరోలు సక్సెస్ కొట్టినా ఆ రికార్డుల్ని, ఆ కలెక్షన్లని బద్దలుకొట్టి సరికొత్త ట్రెండ్ సెట్టర్ అయ్యాడు అల్లు అర్జున్. కేవలం కలెక్షన్లతోనే కాదు కాంట్రవర్సీతో అంతకుమించిన న్యూస్ మేకర్ అయ్యాడు అల్లు అర్జున్.
సౌత్ ఇండియాలోనే కాదు ఇండియా వైడ్ గా సెన్సేషనల్ అయి న్యూస్ లో హాట్ టాపిక్ అవుతున్న హీరో అల్లు అర్జున్. ఈ మద్య అల్లు అర్జున్ కంటే కూడా పుష్ప అన్న పేరుతోనే ఎక్కువగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. పుష్ప 2క్రియేట్ చేస్తున్న మేనియా ఆ రేంజ్ లో ఉంది. అందుకే పుష్ప 2 రిలీజ్ అయ్యి 20 రోజులైనా కూడా 1600 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి ఇంకా కలెక్షన్లు కంటిన్యూ అవుతున్నాయి.
పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్. పుష్ప సినిమాతో బన్నీ క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంతా ఇంతా కాదు. అసలు బన్నీ కెరీర్ పుష్పకి ముందు పుష్ప తర్వాత అని చెప్పొచ్చు. అంతకు ముందు వరకూ అందరు హీరోల్లో ఒక్కడిగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత నేషనల్ లెవల్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. సౌత్ టూ నార్త్ అందరి హీరోలకి సరికొత్త కలెక్షన్ల టార్గెట్లు ఫిక్స్ చేసేశాడు. ఇక ప్రమోషన్స్ ట్రైలర్ లాంచ్ ఎవేరో ఊహించని విధంగా బీహార్ పాట్నాలో భారీ పబ్లిక్ ఈవెంట్ పెట్టి గ్రాండ్ సక్సెస్ చేశారు పుష్ప 2 సినిమాకు. ఆ తర్వాత చెన్నై, ముంబై, హైదరాబాద్, కొచ్చి.. ఇలా వివిధ నగరాల్లో భారీగా ఈవెంట్స్ పెట్టి ప్రమోషన్స్ తోనే సినిమా గురించి దేశమంతా మాట్లాడేలా చేసారు.
Also Read : Allu Arjun : పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్.. మూడున్నర గంటల విచారణలో ఏం తిన్నాడో తెలుసా?
పుష్పతోనే పాన్ ఇండియ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన బన్నీ పుష్ప 2తో అంతకు మించిన మేనియా క్రియేట్ చేశారు. ఎక్కడ చూసినా పుష్ప హవానే, ఏ ఇండస్ట్రీలో చూసినా పుష్ప గురించిన చర్చే. అందుకే పుష్ప 2 రిలీజ్ కి నెవర్ బిఫోర్ క్రేజ్, నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ అయ్యింది. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతకముందెప్పుడూ లేనంతగా 12వేల థియేటర్లలో, 80 దేశాలకు పైగా పుష్ప 2 రిలీజ్ అయ్యింది.
బన్నీ కెరీర్ లో ఎన్ని సినిమాలున్నా పుష్ప కి మాత్రం స్పెషల్ ప్లేస్. అసలు పుష్ప తోనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప తోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప తోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగాడు. పుష్ప తోనే హయ్యస్ట్ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే స్తాయికి వెళ్లాడు. అసలు రిలీజ్ కి ముందే 100కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో అల్లు అర్జున్ కున్న బ్రాండ్ వాల్యూ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.
రిలీజైన ప్రతిచోటా ర్యాంపేజ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది పుష్ప. నాన్ హాలిడే రోజు హయ్యస్ట్ ఓపెనింగ్స్ తో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి రికార్డులు మొదలుపెట్టిన పుష్ప 2 ఇప్పటి వరకూ ఆ రికార్డుల్నికంటిన్యూ చేస్తూనే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్లలో బాహుబలి, RRR రికార్డుల్ని కూడా తుడిచి పెట్టేసిందంటే పుష్ప 2 క్రియేట్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
నైజాంలో నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఏ సినిమాకీ కలెక్ట్ చెయ్యనంతగా ఫస్ట్ డే 25కోట్ల కలెక్షన్లతో హయ్యస్ట్ కలెక్ట్ చేసింది పుష్ప 2. ఫస్ట్ డే దాదాపు 300కోట్ల కలెక్షన్లతో తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకీ రానన్ని ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు బన్నీ. ఓపెనింగ్స్ బానే వస్తాయని ఊహించినా ఇప్పుడు 1600కోట్ల ప్లస్ వరల్డ్ వైడ్ కలెక్షన్లతో 2 వేల కోట్ల మైలురాయిని రీచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు బన్నీ.
పుష్ప 2 కలెక్షన్ల రికార్డులు కంటిన్యూ అవుతున్నాయి. తెలుగు సినిమా కాబట్టి సౌత్ లో ఆ మాత్రం కలెక్షన్ల రికార్డులు పెద్ద విషయమేం కాకపోయినా అసలు పెద్దగా మార్కెట్ లేని బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని కలెక్షన్ల రికార్డుల్ని బద్దలుకొట్టేస్తూ హిందీలో కూడా తనకు తిరుగేలేదని ప్రూవ్ చేసుకుని బాలీవుడ్ లో న్యూస్ మేకర్ అయ్యారు బన్నీ.
పుష్ప కి ముందు బన్నీగురించి బాలీవుడ్ లో పెద్దగా పరిచయం లేదు . ఏదో యాక్షన్ మూవీ కదా అని సరదాగా బాలీవుడ్ లో పుష్ప ని రిలీజ్ చేసింది సుకుమార్ అండ్ టీమ్. అలాంటిది పుష్ప సినిమాతో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ మార్కెట్ లో అడుగుపెట్టిన బన్నీ మొదటి అటెంప్ట్ లోనే మంచి కలెక్షన్లు రాబట్టాడు. ఆ కలెక్షన్లకి కాస్త అటూ ఇటో వస్తుందని ఊహించి పుష్ప 2ని రిలీజ్ చేస్తే అక్కడ ఇంకా కలెక్షన్ల ర్యాంపేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది.
అసలు రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ లో హవా నడిపించాడు బన్నీ. తెలుగుసినిమా అయినా కూడా బాలీవుడ్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప 2. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే లక్ష టికెట్ల బుకింగ్ తో బాలీవుడ్ లో బన్నీకున్న క్రేజ్ ని చూపించింది. ఇక ఈ రికార్డే కాదు బాలీవుడ్ లో తెలుగు సినిమాల పేరు మీదున్న రికార్డుల్ని తుడిచిపెట్టేసింది పుష్ప 2. బాలీవుడ్ లో ఫస్ట్ డే 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందంటే బన్నీకి, పుష్ప 2కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్దం చేస్కోవచ్చు.
Also Read : Dil Raju : సీఎంని టాలీవుడ్ తరపున కలుస్తాం.. లైన్లోకి దిగిన దిల్ రాజు.. వివాదం ముగిసినట్టేనా?
ఫస్ట్ డే 70 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 సినిమా 20రోజులకి 700కోట్ల ప్లస్ కలెక్షన్లతో కంటిన్యూ అవుతూ అక్కడి హీరోలకి నిద్రలేకుండా చేస్తుంది. ఇప్పటి వరకూ ఏ టాలీవుడ్ మూవీ ఇంత తక్కువ పీరియడ్ లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించింది లేదు. ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు పదిలం చేసుకున్న షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సినిమాల రికార్డులన్నీ బద్దలుకొట్టేస్తున్నారు అల్లు అర్జున్.
ఈ రేంజ్ లో పుష్ప 2 కలెక్షన్లు సాధించడంతో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ కూడా హైలైట్ అయ్యింది. సౌత్ లో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ స్టార్ డమ్ ని, తనబ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్న హీరో లేకపోవడంతో రెమ్యూనరేషన్ 300 కోట్లు తీసుకునే స్తాయికి తీసుకెళ్లింది. మొన్నటి వరకూ రెమ్యూనరేషన్ రికార్డ్స్ తమ పేరు మీద పెట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు అల్లు అర్జున్ కంటే వెనకబడిపోయారు. ఇలా అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ దగ్గరనుంచి రికార్డులు బ్రేక్ చెయ్యడం వరకూ అన్నింటిలో ఈ సంవత్సరం న్యూస్ మేకర్ అయ్యారు.
పుష్ప 2తో రికార్డులు తిరగరాయడం, బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతోనే కాదు అంతకుమించిన కాంట్రవర్సీతో 20రోజులుగా ఇండియా మొత్తం న్యూస్ మేకర్ అయ్యారు అల్లు అర్జున్. పుష్ప 2 సక్సెస్ ఒకవైపు పుష్ప 2 తో పాటు వచ్చిన కేసు మరో వైపు. సినిమా రిలీజ్ కాకముందే ప్రీమియర్స్ లోనే బన్నీ తన సినిమా చూడడానికి వెళ్లారు. అయితే ఆ ఒక్క షో బన్నీ లైఫ్ ని మార్చేసింది. సినిమాకి మించిన ట్విస్టుల్ని బన్నీ ఫేస్ చేసేలా చేసింది. పుష్ప 2 సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోనీకుండా చేసింది. సంధ్య ధియేటర్ ఇప్పటి వరకూ బన్నీకి ఫాన్స్ తో ఎలాంటి అనుభవాలను ఇచ్చిందో అన్నింటికీ మించి అంతకుమించి బాధని అల్లు అర్జున్ కి మిగిల్చింది.
సంధ్య ధియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ రోజు అల్లు అర్జున్ రావడం, తొక్కిసలాట జరగడం, ఆ ఇష్యూ లో ఒకరు చనిపోవడంతో కేసులో ఇరుక్కోవాల్సివచ్చింది. ఒక వైపు పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్, మరో వైపు కేసు. కంప్లీట్ డైలమాలో ఉన్న అల్లు అర్జున్ ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండానే సైలెంట్ గా థియేటర్లో తన క్రేజ్ చూపిస్తున్నారు.
Also Read : Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటనలో..మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చిన పోలీసులు..
కానీ కేసు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పెద్ద ఇష్యూ కాదనుకున్న కేసు ఏకంగా బన్నీని జైలుకు పంపేలా చేసింది. అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఒకరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. కేసు విషయంలో బన్నీ జైలుకెళ్లడం, మళ్లీ రావడం, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఏ ఇష్యూ లోనూ ఒకటిగా కనిపించని సినిమా ఇండస్ట్రీ అంతా బన్నీ ఇంటికి వెళ్లి పలకరించడం, ఆ తర్వాత బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, మళ్లీ పోలీసులు ఇంటరాగేషన్ చెయ్యడం కంటిన్యూ అవుతోంది.
అయితే ఈ విషయాన్ని అటు గవర్నమెంట్ ,పోలీసులు సీరియస్ గా తీస్కోవడంతో ఇప్పుడప్పుడే ఈ కేసు సంగతి తేలేలా కనిపించడం లేదు. డైరెక్టర్ గా సీఎం సీన్లోకి రావడంతో ఈ ఇష్యూ సీరియస్ అయిపోయిందంటున్నారు. ఎన్ని సార్లు వీడియో బైట్స్ ఇచ్చినా, ప్రెస్ మీట్స్ పెట్టినా, ఇంటరాగేషన్ కి అటెండ్ అయినా ప్రతి సారీ న్యూస్ లో హైలైట్ అవుతూనే ఉన్నారు బన్నీ.
ఇలా పుష్ప తో నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ పుష్ప 2తో మరోసారి నేషనల్ అవార్డ్ అందుకుంటారనుకుంటున్న టైమ్ లో ఇలా అరెస్ట్ అవ్వడం, కేసులో ఇరుక్కోవడంతో ఆల్ ఓవర్ ఇండియా బిగ్గెస్ట్ న్యూస్ మేకర్ అయిపోయారు. మరి ఈ వివాదం, పుష్ప కలెక్షన్స్ హవా ఎప్పుడు ఆగుతాయో చూడాలి.