Allu Arjun – Pawan Kalyan : సొసైటీలో చాలా మంది లీడర్స్ ని చూసాను.. కానీ ఆయన.. పవన్ పై బన్నీ కామెంట్స్..
ఎన్నికల తర్వాత ఆ ఇష్యూ తర్వాత ఇప్పుడు మొదటిసారి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఇలా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Allu Arjun Interesting Comments on Pawan Kalyan in Balakrishna Unstoppable Show
Allu Arjun – Pawan Kalyan : అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు. నేడు ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే పలువురి గురించి మాట్లాడారు. ఈ క్రమంలో కొంతమంది హీరోల ఫొటోలు చూపించి వాళ్ళ గురించి బన్నీని అడిగాడు బాలయ్య.
ఇందులో పవన్ కళ్యాణ్ ఫోటో చూపించగా అల్లు అర్జున్.. ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్ ను చూస్తుంటాను. కానీ నేను లైవ్ లో దగ్గర్నుంచి ఆయన్ని చూసాను. చాలా డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని అన్నారు. దీంతో బన్నీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పవన్, బన్నీ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
ఇటీవల ఏపీ ఎన్నికల ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఓ వైసీపీ నేతకు ప్రచారం చేయడంతో పవన్ ఫ్యాన్స్ నుంచి, జనసైనికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఎన్నికల తర్వాత ఆ ఇష్యూ తర్వాత ఇప్పుడు మొదటిసారి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఇలా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్, జనసైనికులు బన్నీ విషయంలో కూల్ అవుతారా చూడాలి.