Allu Arjun : రేపు ఉదయం సంథింగ్ స్పెషల్ అంటున్న అల్లు అర్జున్.. పుష్ప 2 గురించేనా..?

రేపు ఉదయం సంథింగ్ స్పెషల్ అంటూ అల్లు అర్జున్ చేసిన పోస్టు దేని గురించి..? పుష్ప 2 రిలీజ్ గురించా..? లేక త్రివిక్రమ్, సందీప్ వంగా మూవీ అప్డేట్స్..?

Allu Arjun : రేపు ఉదయం సంథింగ్ స్పెషల్ అంటున్న అల్లు అర్జున్.. పుష్ప 2 గురించేనా..?

Allu Arjun Something Special post on his instagram story gone viral

Updated On : August 29, 2023 / 8:57 PM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇండియా వైడ్ ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ప్రతి మూమెంట్ ని గమనిస్తున్నారు. తాజాగా బన్నీ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్టు వేశాడు. “రేపు ఉదయం 9 గంటలకు సంథింగ్ స్పెషల్” అంటూ ఒక పోస్టు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ సంథింగ్ స్పెషల్ ఎంటై ఉంటుందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.

Bedurulanka 2012 : చాలా ఏళ్ళ తరువాత ‘బెదురులంక’తో ఆ మాట విన్న కార్తికేయ.. ఏంటి ఆ మాట..?

Allu Arjun Something Special post on his instagram story gone viral

అయితే కొంతమంది ఈ పోస్టు పుష్ప 2 (Pushpa 2) గురించే అని కామెంట్స్ చేస్తున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ క్యాటగిరీల్లో ఇలా రెండు అవార్డులు పుష్పకి రావడంతో మూవీ టీం.. ఈ విషయాన్ని పార్ట్ 2 ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవాలని చూస్తుందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రేపు వచ్చే అప్డేట్ ఈ రిలీజ్ డేట్ గురించి కూడా అయ్యుండొచ్చు. అయితే కొంతమంది మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి పోస్టు కూడా అయ్యుంటుందని చెబుతున్నారు.

Vijay Deverakonda : ఈ పరిచయం ప్రత్యేకం.. విజయ్ దేవరకొండ పోస్ట్ ఆమె గురించేనా..?

బన్నీ తన తదుపరి సినిమాలను త్రివిక్రమ్, సందీప్ వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని ఉపయోగించుకొని.. తమ సినిమాలను లాంచింగ్ తోనే ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం అయ్యుండచ్చని కొందరు చెబుతున్నారు. అయితే ఇంతకీ బన్నీ చెప్పే ఆ సంథింగ్ స్పెషల్ ఏంటనేది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.