ALLU Family : ఫ్యామిలీ అందరికి కటౌట్.. అల్లు రామలింగయ్య నుంచి అల్లు అయాన్ వరకు.. ఫోటో వైరల్..
ఓ సినిమా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALLU Family Cutout From Allu Ramalingaiah to Allu Ayan Photo viral
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, హింది, కన్నడ, మలయాళ బాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక కథానాయిక. పుష్ప మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్ర, టీజర్, ట్రైలర్, పాటలను ఇప్పటికే విడుదల చేయగా అవన్నీ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇక థియేటర్ల వద్ద ఇప్పటి నుంచే ఈ చిత్ర సందడి మొదలైంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. ఓ సినిమా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కటౌట్‌లో అల్లు వారి కుటుంబం మొత్తం ఉండడం విశేషం. అల్లు అయాన్, అల్లు శిరీష్, అల్లు బాబీ, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య లతో కూడిన ఈ కటౌట్ అందరిని ఆకట్టుకుంటోంది.
Movie Shootings : మెగాస్టార్ నుంచి నాని వరకు.. ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
ఇదిలా ఉంటే.. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో సోమవారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలతో పాటు అర్థరాత్రి 1 గంటకు, డిసెంబర్ 5న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోలు పడనున్నాయి. ఆరు భాషల్లో 12 వేలకి పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.