Amitabh bachchan: సినిమా పేరేదైనా.. అందులో రోల్‌ ఏదైనా.. ఆయన ముందు ఇంతే..

Amitabh bachchan: కల్కిలో అమితాబ్‌ నటనే కాదు.. ఫైట్స్‌తోనూ అలరించారు. ప్రభాస్‌తో పోటీపడి మరీ నటించారు.

Amitabh bachchan: సినిమా పేరేదైనా.. అందులో రోల్‌ ఏదైనా.. ఆయన ముందు ఇంతే..

Amitabh bachchan in kalki

Amitabh bachchan: జంజీర్‌ అయినా.. షెహెన్‌షా అయినా..శక్తి అయినా.. సర్కార్‌ అయినా.. బ్రహ్మాస్త్ర అయినా.. కల్కి అయినా.. సినిమా పేరేదైనా.. అందులో రోల్‌ ఏదైనా.. ఆయన ముందు జుజుబి. ఇక ఏజ్‌ అంటారా.. ! అస్సలు ఆ మాటెత్తకపోవడమే నయం. ఎవరైనా పెరిగే కొద్దీ సీనియర్‌ నటుడవుతారు. కానీ.. ఆయన వయసు మీదపడుతున్నకొద్దీ మరింత యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా మారిపోతున్నారు.

పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలో ఆయన్ను మించినవాళ్లు లేరు.. అందుకే నిజమైన మాస్‌ హీరో అని కొందరు.. నిరంతరం శ్రమించే ఎవర్‌గ్రీన్‌ యూనివర్సల్‌ స్టార్‌ అని మరికొందరు కీర్తిస్తున్నారు. ఆయనే.. పరిచయం అక్కర్లేని ..అమితాబ్‌ బచ్చన్‌.

అమితాబ్‌ బచ్చన్‌.. బిగ్‌ బీ.. శతాబ్దపు మహానాయకుడు.. యుగపురుషుడు, బాలీవుడ్‌ షెహెన్‌ షా.. వన్‌ అండ్‌ ఓన్లీ స్టార్‌ ఇన్ ఇండస్ట్రీ.. ఇలా వర్ణించుకుంటూ పోతే.. ఇక దానికి అంతే ఉండదు. బచ్చన్ అనే పేరులోనే బాల్యం ఉంది. అందుకేనేమో ఆయన 8 పదుల వయసు దాటినా… నటనలో నిత్యనూతనంతో తొణికిసలాడే బాలుడిలానే కనబడుతున్నాడు.

కల్కి2898 AD .. ఈ సినిమా ఇప్పడు వరల్డ్‌ వైడ్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అమితాబ్‌ బచ్చన్‌ కోసమే ఈ కథ రాసుకున్నారా.. లేక ఆ పాత్రకు ఆయన జీవం పోశారా.. ! అన్నంతలా అశ్వథ్థామ క్యారెక్టర్‌లో నటించడం కాదు.. జీవించేశారు బిగ్‌ బీ. ఇది ఏ ఒక్కరో అంటున్న మాట కాదు.. హోల్‌ అండ్‌ సోల్‌గా వరల్డ్‌ వైడ్‌ నుంచి ముక్త కంఠంతో ఆయనపై కురిపిస్తున్న ప్రశంసలు.

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌..
ఆరడుగుల ఆజానుబాహుడు.. గంభీరమైన కంఠం.. కథ ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా ఇట్టే అందులో ఒదిగిపోయే నటవైవిధ్యం.. ఇవే అమితాబ్‌ను ఎవర్‌గ్రీన్‌ యాక్టర్‌గా నిలబెట్టాయి. ఆ నటనకు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. అమితాబ్‌ గారు ఒరిజినల్‌ మాస్‌ హీరో.. ఇది హీరో నాగార్జున ఇచ్చిన కితాబు. ఆయనను సీనియర్‌ నటుడని పిలవాలో.. నూతన నటుడని అనాలో తెలీదు.

చిన్న పిల్లలు కూడా కేరింతలు కొట్టేలా అమితాబ్‌ నటన అద్భుతం… ఇది వర్సటైల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ చేసిన కామెంట్‌. నిరంతరం పనిని ప్రేమించి, శ్రమించే తత్వమే ఆయన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌ సీక్రెట్‌ అయ్యుంటుంది.. ఇది బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ అమితాబ్‌ను ఉద్దేశించి అన్న మాటలు. వీళ్లే కాదు..చిరంజీవి, రజనీకాంత్‌ నుంచి నేటితరం యువ కథనాయకులు, నటుల వరకు ఆందరికీ ఆయన రోల్‌ మోడల్‌ . నటనలో నిత్యం ఓనమాలు నేర్చుకునే విద్యార్థి.. ది గ్రేట్‌ లెజండరీ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్‌ అంటూ కీర్తిస్తున్నారంతా.

అశ్వత్థామ పాత్రలో
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్‌ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898 AD వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటోంది. నేషనల్ వైడ్ గా సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

దానికి కారణం ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించడమే. ఈ మూవీ మొత్తంలో అమితాబ్ రోల్ హైలైట్‌. ఆ పాత్ర లేకుండా అసలు కల్కి మూవీనే లేదు. ఆ పాత్రలో అమితాబ్‌ కాకుండా ఇంకెవరు నటించినా అంత ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసుండేది కాదు.. ఇది సినీ క్రిటిక్స్‌ నుంచి మూవీ గోయెర్స్‌ అంతా సింగిల్‌ వర్డ్‌గా చెబుతున్న మాట.

అప్పుడెప్పుడో జంజీర్‌, షోలే, త్రిశూల్‌ లాంటి పాత్రలు అమితాబ్‌ను నటుడిగా ఉన్నత శిఖరాలపై నిలబెట్టాయి. ఆ తర్వాత ఎంతోమంది బాలీవుడ్‌ డైరెక్టర్లు ఆయన్ను బిగ్‌ బీగా కీర్తించేలా చేశాయి. కానీ.. నట విశ్వరూపం అంటారే.. దాన్ని ఎగ్జాక్ట్‌లీ ప్రేక్షకులకు పరిచయం చేసిన మూవీ ఏదైనా ఉందంటే.. రీసెంట్‌ కల్కినే. అందులో అశ్వథ్థామ పాత్రను చూసిన ఫ్యాన్స్‌ విజిల్స్‌తో దుమ్మురేపుతున్నారంటే.. అమితాబ్‌ బచ్చన్‌ ఆ క్యారెక్టర్‌ కోసం పడిన శ్రమే.

పనిని ప్రేమించే వాళ్లు వయసును పట్టించుకోరు. అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రశంసించే వాళ్లు.. ఆయన్ను దగ్గర్నుంచి చూసినవాళ్లెవరైనా ఇదే అంటారు. కల్కి మూవీలో అమితాబ్‌ అశ్వథ్థామగా కనిపించడానికి చాలానే కష్టపడ్డారు. ఆ మేకప్‌ కోసం ప్రతి రోజూ 3 గంటలు సహనంగా కదలకుండా కూర్చోవాల్సి వచ్చేది. దానికి తోడు కాస్ట్యూమ్స్‌ కూడా హెవీగా ఉండేవి.

హెయిర్ స్టైల్‌, స్కిన్‌ కేర్‌ ఇలా అన్నీ పర్ఫెక్ట్‌గా కుదరడం కోసం చాలా సహనంతోనే ఆ పాత్రకు తగిన విధంగా అమితాబ్‌ మారారు. 80 ఏళ్లు పైబడిన ఈ కంప్లీట్‌ యాక్టర్‌.. తనకు యాభైఏళ్ల నటనానుభవం ఉందన్న సంగతి కూడా మరిచిపోయారు. అదేదో అప్పుడే నటన నేర్చుకుంటున్న యాక్టింగ్‌ స్టూడెంట్‌లా.. ప్రతి అంశాన్ని ఓర్పు, సహనంతో.. క్షుణ్ణంగా, శ్రద్ధగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

ఇది అమితాబ్‌ను దగ్గరగా పరిశీలించిన కల్కి మూవీ టీమ్‌ చెబుతున్నమాట. ఆ కష్టం వృథాపోలేదు.. అమితాబ్‌పై మరింత అమితమైన ప్రేమను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికులు కురిపించేలా చేసింది. కల్కిలో ఆయన నటనా వైభవాన్ని వేనోళ్ల కీర్తిస్తోంది.

ఫైట్స్‌తోనూ..
కల్కిలో అమితాబ్‌ నటనే కాదు.. ఫైట్స్‌తోనూ అలరించారు. ప్రభాస్‌తో పోటీపడి మరీ నటించారు. ఆ వయసులో.. ప్రభాస్‌లాంటి నటుడితో పైగా ఫైట్‌ సీక్వెన్స్‌లలో చేయడమంటే అది సాధారణ విషయం కాదు. 60 ఏళ్లు దాటాక ఏ నటుడైనా డ్యాన్స్‌లు, ఫైట్‌లంటే వద్దులే అనేస్తారు.. కానీ.. అమితాబ్‌.. అప్పుడే ఇండస్ట్రీలోకొచ్చిన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ యాక్టర్‌లా ఏజ్‌తో ప్రమేయం లేకుండా తన పాత్రకు న్యాయం చేసేందుకు నిజమైన యోధుడిలా మారిపోయారనడంలో అతిశయోక్తి లేదు.

Kalki three Days Collections : క‌ల్కి మూవీ క‌లెక్ష‌న్ల సునామీ.. మూడు రోజుల్లో ఎంతంటే..?

అందుకే ఆయన యాక్షన్‌ సీన్స్‌ అంతా నెక్ట్స్‌ లెవల్ అనిపించాయి. బిగ్‌ బీ నుంచి ఆఫ్టర్‌ లాంగ్‌ టైం ఇంత భారీ స్కోప్‌ ఉన్న యాక్షన్ సీన్స్‌ వచ్చాయని చెప్పొచ్చు. అమితాబ్‌ లాంటి నటుడికి కూడా ఇది డబుల్‌ ఎనర్జీ ఇచ్చిన మూమెంటే.