Gam Gam Ganesha : రూటు మార్చిన ఆనంద్ దేవరకొండ.. యాక్షన్ మూవీనా, కామెడీ సినిమానా..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు ఆనంద్ దేవకొండ (Anand Deverakonda). 'దొరసాని' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.

Gam Gam Ganesha first look
Gam Gam Ganesha first look : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). ‘దొరసాని’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’ సినిమాలతో తనదైన ముద్ర వేశాడు. ఇక ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ హీరో తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. యాక్షన్ జోనర్‌ను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
Deepthi Sunaina : దీప్తి సునయనకు ప్రమాదం..! అసలు నిజం ఇదే..
ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) అనే చిత్రంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్నాడు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరోయిన్ సమంత విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఆనంద్ రెండు రైఫిల్స్ పట్టుకుని కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్, బాంబ్ బ్లాస్ట్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ ఫన్ గన్ అనే రాసి ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
LEO : విదేశాల్లో ‘లియో’ సంచలనం.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీసు రికార్డు
ఈ పోస్టర్‌ను ఆనంద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా..? కామెడీ మూవీనా..? ..త్వరలో మనం తెలుసుకుందాం అని మరిన్ని డీటెయిల్స్, ఎగ్జైటింగ్ అప్‌డేట్లు రాబోతున్నాయి అంటూ రాసుకొచ్చాడు.
View this post on Instagram