అంజలి.. ‘లిసా’ టీజర్ విడుదల

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 09:07 AM IST
అంజలి.. ‘లిసా’ టీజర్ విడుదల

Updated On : March 21, 2019 / 9:07 AM IST

హీరోయిన్ అంజ‌లి తెర మీద క‌నిపించి చాలాకాలం అయింది. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టించి అభిమానుల అల‌రించిన అంజ‌లి కొంత గ్యాప్ తీసుకుంది. ఆమె గతంలో గీతాంజలి, చిత్రాంగథ వంటి హారర్ చిత్రాల్లో నటించి హిట్లు కొట్టింది. టాలీవుడ్ ను మెప్పించిన సీతమ్మ మరోసారి త‌న‌కు క‌లిసి వ‌చ్చిన హారర్ క‌థ‌నే న‌మ్ముకుని ‘లిసా’ చిత్రంతో దెయ్యం అవతారం ఎత్తింది. రాజు విశ్వనాథ్ రచన, దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తమిళ్‌లో ఇప్పటికే విడుదల చేయగా.. తాజాగా తెలుగు వెర్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ‘24’ చిత్రానికి రచనా సహకారం అందించిన రాజు విశ్వనాత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
Read Also : చాయ్‌వాలా టూ పీఎం: ట్రైలర్ చూశారా?

పాపా.. పాపా కథ చెప్పనా.. కాకి.. నక్కల కథ చెప్పనా..అంటూ ఒక అడవిలో ఓ బూత్ బంగ్లా అందులో తిరిగే దెయ్యం చేసే విన్యాసాలతో మకరంద్ దేశ్ పాండే భయానక రూపంతో ప్రారంభమైన ఈ టీజర్ అన్ని హారర్ సినిమాల మాదిరే అచ్చుగుద్దినట్టు అనిపిస్తుంది. అయితే హారర్ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. ఇక టీజర్‌తో పెద్దగా భయపెట్టలేకపోయిన అంజలి దెయ్యం.. ‘లిసా’ మూవీతో దడపుట్టిస్తుందేమో చూడాలి. సామ్ జోన్స్, మకరంద్ దేశ్ పాండే,బ్రహ్మానందం ,యోగి బాబు,సలీమా ,మైమ్ గోపీ, సురేఖ వాణి , కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : నెత్తిపై పిడుగు : హెల్మెట్ వల్లే బతికాడు