Bichagadu 2 : బిచ్చగాడు 2 హిట్ అవుతుందా? బిచ్చగాడు సినిమాకు తెలుగులో ఎన్ని లాభాలు వచ్చాయో తెలుసా??

బిచ్చగాడు.. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అక్కడెక్కడో తమిళ్ లో ఉండి అసలు తెలుగు వాళ్లకు పరిచయం లేని హీరో విజయ్ ఆంటోనీ ఈ బిచ్చగాడు సినిమాతోనే తెలుగులోకూడా పాపులర్ అయ్యారు.

Bichagadu 2 : బిచ్చగాడు 2 హిట్ అవుతుందా? బిచ్చగాడు సినిమాకు తెలుగులో ఎన్ని లాభాలు వచ్చాయో తెలుసా??

Bichagadu 2 movie ready to release

Updated On : May 6, 2023 / 1:51 PM IST

Bichagadu 2 :  2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బోల్డంత ఇమేజ్, క్రేజ్, తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆ ఒక్క సినిమాతోనే విజయ్ ఇప్పటి వరకూ తన సినిమాల్ని ఇదే హైప్ తోనే రిలీజ్ చేస్తున్నారు. విజయ్ కెరీర్ నే మార్చేసిన బిచ్చగాడు కి సీక్వెల్ ఇపుడు రిలీజ్ అవుతోంది.

బిచ్చగాడు.. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అక్కడెక్కడో తమిళ్ లో ఉండి అసలు తెలుగు వాళ్లకు పరిచయం లేని హీరో విజయ్ ఆంటోనీ ఈ బిచ్చగాడు సినిమాతోనే తెలుగులోకూడా పాపులర్ అయ్యారు. ఆ రేంజ్ సక్సెస్ అందించింది బిచ్చగాడు. పెద్దగా వెల్ నోన్ కాని హీరో డబ్బింగ్ సినిమాతో తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నాడంటే అది బిచ్చగాడు సినిమా వల్లనే.

బిచ్చగాడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న బిచ్చగాడు 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. 2016లో వచ్చిన బిచ్చగాడు మూవీ తెలుగులో 15 కోట్లు కలెక్ట్ చేసింది. జస్ట్ 2 కోట్లతో కొన్న బయ్యర్లకు ఏకంగా 13 కోట్ల లాభాలు మిగిల్చింది. ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చిన బిచ్చగాడు 2 మీద తెలుగులో మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగులో అప్పట్లో 100రోజులు ఆడిన డబ్బింగ్ సినమాగా రికార్డ్ కూడా క్రియేట్ చేసింది బిచ్చగాడు మూవీ. ఆ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా బిచ్చగాడు 2 మే 19న ధియేటర్లోకొస్తోంది.

Navdeep : నేను ‘గే’ కాదు.. నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు.. నవదీప్ సంచలన వ్యాఖ్యలు..

ఇప్పుడొస్తున్న సీక్వెల్ కూడా అందరికీ రీచ్ అయ్యేలా యాక్షన్, ఎమోషన్ అంతకుమించి డ్రామా ఉండడంతో బిచ్చగాడు 2 మీద హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు విజయ్ ఆంటోనీ ప్రమోషన్స్ కూడా సినిమాకి కావల్సినంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. బిచ్చగాడు 2 ట్రైలర్, విజయ్ అగ్రెషన్ చూస్తుంటే బిచ్చగాడు 2 కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫాన్స్. ఇక పార్ట్ 2 కి విజయ్ సొంతంగా దర్శకత్వం వహించి, తెలుగులో కూడా తానే డైరెక్ట్ గా వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నాడు.