Bichagadu : బిచ్చగాడు సినిమా తెలుగులో ఆ హీరో చెయ్యాలి.. కానీ..
బిచ్చగాడు సినిమాని డబ్బింగ్ కాకుండా మొదట రీమేక్ చేయాలనున్నారు. విజయ్ ఆంటోనీ హీరో, దర్శకుడు మాత్రమే కాక సంగీత దర్శకుడు కూడా. విజయ్ ఆంటోనీ తెలుగులో శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు.

Bichagadu Movie Remake wants to do with srikanth
Srikanth : 2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు(Bichagadu) తెలుగులో భారీ విజయం సాధించింది. జస్ట్ 2 కోట్లతో డబ్బింగ్ రైట్స్ కొన్న బయ్యర్లకు ఏకంగా 15 కోట్లు కలెక్ట్ చేసి ఫుల్ గా లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమాతో హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) తెలుగులో బోల్డంత ఇమేజ్, క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు. విజయ్ కెరీర్ నే మార్చేసిన బిచ్చగాడు కి సీక్వెల్ రిలీజ్ అవుతుందని తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా బిచ్చగాడు 2 మే 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
బిచ్చగాడు 2 లో విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే బిచ్చగాడు సినిమాని డబ్బింగ్ కాకుండా మొదట రీమేక్ చేయాలనున్నారు. విజయ్ ఆంటోనీ హీరో, దర్శకుడు మాత్రమే కాక సంగీత దర్శకుడు కూడా. విజయ్ ఆంటోనీ తెలుగులో శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. దీంతో శ్రీకాంత్, విజయ్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
Bichagadu 2 : బిచ్చగాడు 2 హిట్ అవుతుందా? బిచ్చగాడు సినిమాకు తెలుగులో ఎన్ని లాభాలు వచ్చాయో తెలుసా??
బిచ్చగాడు రిలీజయి పెద్ద హిట్ అయిన తర్వాత మొదట తెలుగులో శ్రీకాంత్ హీరోగా రీమేక్ చేద్దామని ప్లాన్ చేశారు. కొన్ని రోజులు ఆ సినిమా కోసం వర్క్ కూడా చేశారు. శ్రీకాంత్ కూడా ఆ సినిమా నచ్చి చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ బడ్జెట్ ఎక్కువైపోతుండటంతో ఆ రీమేక్ ఆగిపోయింది. దీంతో కేవలం డబ్బింగ్ రైట్స్ తీసుకొని సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికి తెలిసిందే. ఇప్పటికి శ్రీకాంత్ బిచ్చగాడు రీమేక్ చేయలేదని బాధపడతాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయం స్వయంగా తెలిపారు.