కోమలి రీమేక్‌లో అర్జున్ కపూర్
తమిళ్ సూపర్ హిట్ 'కోమలి' రీమేక్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. హీరోగా నటించనున్న అర్జున్ కపూర్..

తమిళ్ సూపర్ హిట్ ‘కోమలి’ రీమేక్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.. హీరోగా నటించనున్న అర్జున్ కపూర్..
జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే మెయిన్ లీడ్స్‌గా, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో, వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, ఇషారి కె.గణేష్ నిర్మాణంలో రూపొందిన తమిళ సినిమా ‘కోమలి’.. అనుకోకుండా 16 ఏళ్ల పాటు కోమాలో ఉన్న వ్యక్తి తిరిగి సృహలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే అంశాలతో కామెడీ హైలెట్‌గా తెరకెక్కిన ‘కోమలి’ తమిళ్‌లో సూపర్ హిట్ అయింది.
జయం రవి రకరకాల గెటప్స్‌లో డిఫరెంట్‌గా కనిపించి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ‘కోమలి’ రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. ఆయన తనయుడు అర్జున్ కపూర్ హీరోగా నటించనున్నాడు.
Read Also : పెన్సిల్‌పై ప్రభాస్ పేరు చూశారా!
హిందీతో పాటు తెలుగు, కన్నడ హక్కులను కూడా ఆయన సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. అజిత్ నటించిన ‘నేర్‌కొండ పార్వై’ (పింక్ రీమేక్) చిత్రంతో నిర్మాతగా కోలీవుడ్‌లోకి ఎంటర్ అయిన బోనీ కపూర్ ప్రస్తుతం అజిత్ 60వ సినిమాను నిర్మిస్తున్నారు.