Cinema Politics : ఎన్టీఆర్ చెంతకు BRS.. మెగా ఫ్యామిలీ చెంతకు BJP.. తెలంగాణలో కొత్త రాజకీయం

తెలంగాణలో BRS వర్సెస్ BJP అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు సినిమా వాళ్ళని ఆకర్షించి వాళ్ళ అభిమానుల ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Cinema Politics : ఎన్టీఆర్ చెంతకు BRS.. మెగా ఫ్యామిలీ చెంతకు BJP.. తెలంగాణలో కొత్త రాజకీయం

BRS and BJP Leaders trying to get ntr and mega family support

Updated On : May 3, 2023 / 7:40 AM IST

Cinema Politics :  రాజకీయాలు, సినిమాలు రెండూ చెట్టాపట్టాలేసుకొని నడవాల్సిందే. రాజకీయ నాయకులు తమ ఓట్ బ్యాంక్ కోసం సినిమాలను, సినిమా వాళ్ళను వాడుకుంటారు. సినిమా(Cinema) వాళ్ళు కూడా తమ పనులు జరగడానికి రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తారు. వారు పిలిస్తే ఈవెంట్స్ కి వెళతారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణలో(Telangana) ఎలక్షన్స్(Elections) ఉండటంతో రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయి. అన్ని పార్టీలు రోజుకో ఎత్తుగడలతో ముందుకి వెళ్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో BRS వర్సెస్ BJP అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు సినిమా వాళ్ళని ఆకర్షించి వాళ్ళ అభిమానుల ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇప్పటికే BJP చిరంజీవిని, రామ్ చరణ్ ని కలిసింది. ఇటీవల నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత చరణ్ ఇండియాకు రావడంతోనే వెళ్లి అమిత్ షాను కలిశారు. మెగాస్టార్ కూడా ఈ మీటింగ్ లో భాగమయ్యారు. అసలు చిరంజీవితోనే బీజేపీ ఈ మీటింగ్ పెట్టించిందని టాక్ కూడా వినిపించింది. గతంలో చిరంజీవి కేంద్రమంత్రిగా చేయడంతో పలువురు కేంద్ర రాజకీయ నాయకులతో ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయి చిరుకి. RRR సినిమాతో చరణ్ దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. దీంతో బీజేపీ పెద్దలు మెగా ఫ్యామిలీకి దగ్గరవ్వాలని చూస్తున్నాయి. ఇటీవల చరణ్ మోదీ పాల్గొనే ఓ సమ్మిట్ లో కూడా పాల్గొన్నాడు. ఇక ఎలాగో జనసేనతో బీజేపీ పొత్తు ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో బీజేపీ మెగా ఫ్యామిలీకి దగ్గరవుతూ ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ మెగా అభిమానుల ఓట్లు సంపాదించడానికి ట్రై చేస్తుంది.

కొన్ని రోజుల క్రితం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు చిరంజీవిని పర్సనల్ గా కలిశారు. ఇటీవల అమిత్ షా చేవెళ్లకు వచ్చినప్పుడు చరణ్, ఎన్టీఆర్ తో మీటింగ్ అనుకున్నారు కానీ అనివార్య కారణాలతో చివరి నిమిషంలో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. త్వరలో మరింతమంది బీజేపీ పెద్దలు చిరంజీవిని, చరణ్ ని RRR సినిమా పేరుతో కలిసే అవకాశాలు ఉన్నాయని టాక్ కూడా నడుస్తుంది.

NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

తాజాగా తెలంగాణ మంత్రి, BRS నేత పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ ని కలిశారు. ఎన్టీఆర్ ని కలిసి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మే 28న ఎన్టీఆర్ ఖమ్మం వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇది BRS నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుండటంతో ఎన్టీఆర్ కి BRS దగ్గర అవ్వాలని చూస్తోంది. ఓ పక్క తెలుగుదేశం, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు గత కొన్ని రోజులుగా చేస్తున్నా ఎందులోనూ ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఇప్పుడు BRS చేసే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

Chiranjeevi : కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చిరు, నాగ్ భేటీ.. సినీ పరిశ్రమలోని సమస్యలు పై చర్చ..

ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం అంతగా లేకపోయినా ఈ సారి మాత్రం పోటీ చేయాలని చూస్తుంది. ఇలాంటి నేపథ్యంలో BRS పార్టీ ఎన్టీఆర్ కి దగ్గరవుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. RRR సినిమాతో చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు వీరి సపోర్ట్ కోసం రాజకీయ పార్టీలు తెగ ట్రై చేస్తున్నాయి. మరి ఈ సినిమా రాజకీయాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.