ఎంత సక్కగ రాశారో: చంద్రబోస్‌పై దేవిశ్రీ ప్రసాద్ పాట

  • Published By: vamsi ,Published On : May 28, 2020 / 08:24 AM IST
ఎంత సక్కగ రాశారో: చంద్రబోస్‌పై దేవిశ్రీ ప్రసాద్ పాట

Updated On : May 28, 2020 / 8:24 AM IST

చంద్రబోస్.. తెలుగు సినిమా పాటల రచయిత.. తాజ్ మహల్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన పాతికేళ్లుగా.. తనదైన పదాలతో పాటలు రాస్తూ పాటల రచయితగా స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25ఏళ్లు అయిన నేపథ్యంలో ఆయనపై ఓ పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు.

ఆ పాటను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపాడు. రామ్ చరణ్, సమంతల రంగస్థలం సినిమా కోసం చంద్రబోస్ ఎంత సక్కగున్నావే పాట రాయగా.. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై ‘ఎంత సక్కగ రాశారో’ అంటూ దేవిశ్రీ పాట పాడారు. ఈ పాట అభిమానులను అలరిస్తోంది. 

వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే గ్రామంలో జన్మించిన చంద్రబోస్.. ఇంజనీరింగ్ పూర్తిచేసి సినిమా రంగంపై ఉన్న మక్కువతో రచయితగా సినీ రంగం వైపు వచ్చారు. తాజ్‌మహల్ సినిమాలో మంచుకొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి ఆయనకు ఫస్ట్ టైమ్ అవకాశం దక్కింది. 800 సినిమాల్లో 3300పాటలు ఆయన రాశాడు. ఆది సినిమాలోని నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అనే పాటకు ఆయనకు నంది పురస్కారం దక్కింది. 

Read: అందం మరింత పెరిగిపోతోంది : మహేష్ న్యూ లుక్..