సి.కళ్యాణ్ బర్త్‌డే పార్టీలో చిరు, బాలయ్య సందడి!
సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు వేడుకకు అతిథులుగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ..

సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు వేడుకకు అతిథులుగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ..
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
బాలయ్య సతీమణి వసుంధర దేవితో సహా విచ్చేశారు. దర్శకుడు వినాయక్ కూడా ఈ వేడుకలో మెరిశారు. చిరు, బాలయ్య కేక్ కట్ చేసి కళ్యాణ్‌కు తినిపించారు. చిరు, బాలయ్య కార్యక్రమం జరిగినంత సేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
కళ్యాణ్ ‘పరమవీరచక్ర’, ‘జైసింహా’ తర్వాత బాలయ్యతో మూడో సినిమా ‘రూలర్’ చేస్తున్నాడు. త్వరలో బాలయ్య, వి.వి.వినాయక్ కలయికలో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. ‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది.