Chiranjeevi : చిరంజీవి కల తీరిందా? 17 ఏళ్ళ క్రితం వజ్రోత్సవంలో చిరంజీవి బాధ.. ఇప్పుడు గోవా ఫిలిం ఫెస్టివల్ లో టాలీవుడ్ హవా..

ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.

Chiranjeevi : చిరంజీవి కల తీరిందా? 17 ఏళ్ళ క్రితం వజ్రోత్సవంలో చిరంజీవి బాధ.. ఇప్పుడు గోవా ఫిలిం ఫెస్టివల్ లో టాలీవుడ్ హవా..

Chiranjeevi Happy With Tollywood Ruling in Goa International Film Festival of India 2024

Updated On : November 24, 2024 / 10:17 AM IST

Chiranjeevi : గతంలో తెలుగు సినిమా వజ్రోత్సవం 2007లో జరిగినప్పుడు చిరంజీవి ఆ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్ లో తెలుగు సినిమాలకు, తెలుగు వారికి బయట రాష్ట్రాల్లో గుర్తింపు లేదు. ముంబై, ఢిల్లీ, గోలా ఫిలిం ఫెస్టివల్స్ లో తెలుగు నటీనటులను పట్టించుకోవట్లేదు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో మహానటుడు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు గారి ఫోటోలు కూడా లేవు. ఇక మా సంగతి అయితే చెప్పనవసరం లేదు అంటూ బాధపడుతూ ఫైర్ అయ్యారు.

అయితే అప్పటికి ఇప్పటికి టాలీవుడ్ బాగా ఎదిగింది. బాహుబలి నుంచి మొదలైన టాలీవుడ్ ప్రస్థానం ఇప్పుడు పుష్ప 2 వరకు దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ గా అనేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా తెలుగు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ తో పాటు మిగిలిన సినీ పరిశ్రమలు తెలుగు సినిమాలను చూసి జెలస్ ఫీల్ అయ్యే స్థాయికి ఎదిగింది టాలీవుడ్.

Also Read : Kalki Part 2 : కల్కి 2 పై అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. కల్కి పార్ట్ 1 విదేశాల్లో రిలీజ్ చేస్తాం..

ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతుంది. ఈసారి ఈ ఫిలిం ఫెస్టివల్ లో మొత్తం టాలీవుడ్ హవానే నడుస్తుంది. ఫిలిం ఫెస్టివల్ రోడ్ షోలో మన టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమాకు సంబంధించిన బొమ్మలతో ప్రదర్శన చేసారు. ఈ గౌరవం అందుకున్న మొదటి తెలుగు సినిమా బాహుబలి. అలాగే ఏఎన్నార్ 100 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఏఎన్నార్ క్లాసిక్ సినిమాలను ప్రదర్శించారు. అక్కినేని ఫ్యామిలీ హాజరయ్యారు. కల్కి నిర్మాతలు, నాగార్జున, రానా, తేజ సజ్జ.. పలువురిని సన్మానించి మీడియాతో మాట్లాడే కార్యక్రమాలు చేసారు.. ఇలా ఈసారి గోవా ఫిలిం ఫెస్టివల్ లో ఎటు చూసిన టాలీవుడ్ హవానే కనిపిస్తుంది.

దీంతో ఒకప్పుడు 17 ఏళ్ళ క్రితం చిరంజీవి పడిన ఆవేదనకు ఇవాళ సరైన సమాధానం వచ్చిందని, తెలుగు నటీనటులను పట్టించుకోని స్థాయి నుంచి తెలుగు సినిమాలతోనే ఫిలిం ఫెస్టివల్ నడిచే స్థాయికి ఎదిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫిలిం ఫెస్టివల్ తో చిరంజీవి బాధ తీరుతుందని, టాలీవుడ్ మరింత ఎదుగుతుందని అంతా అంటున్నారు.