Vijay Deverakonda : మెగాస్టార్ కంటే ముందు విజయ్ విన్నాడు.. ఎందుకు చెయ్యలేదంటే..

మెగాస్టార్ కంటే ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ స్క్రిప్ట్ నేరేట్ చేశారట బాబీ..

Vijay Deverakonda : మెగాస్టార్ కంటే ముందు విజయ్ విన్నాడు.. ఎందుకు చెయ్యలేదంటే..

Vijay Deverakonda

Updated On : July 26, 2021 / 8:37 PM IST

Vijay Deverakonda: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లు చెప్పిన కథలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కించే బాధ్యత మోహన్ రాజాకు అప్పజెప్పారు.

Chiranjeevi : స్పీడ్ మీదున్న చిరు..

తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నారు చిరు. మెగాస్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని మాంచి మాస్ మసాలా స్క్రిప్ట్ రెడీ చేశారు బాబీ. కథ వినగానే రెండో మాట లేకుండా ఎస్ చెప్పేశారు చిరంజీవి. అయితే మెగాస్టార్ కంటే ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ స్క్రిప్ట్ నేరేట్ చేశారట బాబీ.

Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. సౌత్ నుండి ఫస్ట్ హీరో..

కథ విని బాగా ఇంప్రెస్ అయిన విజయ్ ఈ సినిమా చెయ్యాలనుకున్నాడు కానీ బిజీ షెడ్యూల్స్ కారణంగా.. రెండు సంవత్సరాల వరకు డేట్స్ ఫిల్ అయిపోవడం, మధ్యలో కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసే వీలు కూడా లేకపోవడంతో డ్రాప్ అయిపోయాడనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.