Chiranjeevi – Ram Charan : వైజాగ్‌లో రామ్‌చరణ్ పొలిటికల్ మీటింగ్.. చిరు యాక్షన్‌ ప్లాన్..

వైజాగ్‌లో రామ్‌చరణ్ పొలిటికల్ మీటింగ్ చేస్తుంటే.. చిరంజీవి యాక్షన్ ప్లాన్ సెట్ చేస్తున్నారు.

Chiranjeevi – Ram Charan : వైజాగ్‌లో రామ్‌చరణ్ పొలిటికల్ మీటింగ్.. చిరు యాక్షన్‌ ప్లాన్..

Chiranjeevi Vishwambhara Ram Charan Game Changer

Updated On : March 15, 2024 / 1:11 PM IST

Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి ‘విశ్వంభర’ని, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ని షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. విశ్వంభర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంటే, గేమ్ ఛేంజర్ చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతుంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ ఆర్‌కె బీచ్ లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్ లో రామ్ చరణ్, ఎస్ జె సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది.

ఇక ఓపెన్ షూటింగ్ కావడంతో.. సెట్స్ లోని రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ లో రామ్ చరణ్.. స్టైలిష్ జెంటిల్ మెన్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినది అని సమాచారం. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఆ ఫోటోలు, వీడియోలను మీరు చూసేయండి.

Also read : RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అండ్ టైటిల్ అప్డేట్..

రామ్ చరణ్ ఇలా పొలిటికల్ మీటింగ్స్ తో షూటింగ్ చేస్తుంటే.. చిరంజీవి యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఒక భారీ పోరాట సన్నివేశాన్ని పూర్తీ చేసిన విశ్వంభర మూవీ టీం.. ఇప్పుడు మరోసారి మరో యాక్షన్ సీక్వెన్స్ ని రూపొందించడానికి రెడీ అవుతుందట. నెక్స్ట్ వీక్ సెట్స్ పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రాన్ని వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సిస్టర్ సెంటిమెంట్ తో రాబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.