Trisha: గుడిలో త్రిష పెళ్లి పూజలపై క్లారిటీ వచ్చేసింది
వెండితెర మీదకి వచ్చే ఇరవై ఏళ్ళు గడిస్తే ఈ చెన్నై చంద్రం వయసు కూడా నలభైకి చేరువలో ఉంది. దక్షణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి ఇప్పుడు కూడా..

Trisha
Trisha: వెండితెర మీదకి వచ్చే ఇరవై ఏళ్ళు గడిస్తే ఈ చెన్నై చంద్రం వయసు కూడా నలభైకి చేరువలో ఉంది. దక్షణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి ఇప్పుడు కూడా ఇంకా కుర్ర హీరోలతో జోడీ కడుతూనే ఉంది. ఇప్పటికే అర్దమై ఉంటుంది ఇది త్రిషా గురించేనని. ఔను.. నాలుగు పదులు వయసు టచ్ చేస్తున్నా త్రిషకు పెళ్లి ఘడియలు మాత్రం దగ్గరదాకా వచ్చి వెనక్కి వెళ్తున్నాయి.
త్రిష ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని గత ఐదారేళ్ళగా వింటూనే ఉన్నాం. ఆ మధ్య నిశ్చతార్ధం కూడా జరగగా పెళ్లి వరకు వెళ్లకుండానే అది కటీఫ్ అయిపొయింది. అంతకు ముందు పలువురు హీరోల పేర్లు, బడా బడా బిజినెస్ మెన్ల పేర్లతో కలిపి త్రిష ప్రేమ వార్తలు వినిపించగా వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమ, నిశ్చితార్థం కూడా పూర్తయి పెళ్లిని రద్దు చేసుకున్నారు. అప్పటి నుండి త్రిష ప్రేమ, పెళ్లి పుకార్లు మరింత పెరిగిపోయాయి.
ఈమధ్యనే త్రిష మధ్యప్రదేశ్ లోని ఓ గుడిలో పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేసిందని ప్రచారం జరుగుతుంది. ఈ పెళ్లి పూజలపై కాస్త స్పష్టత వచ్చింది. త్రిష ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా చేస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ మధ్యప్రదేశ్ లోని ఓర్చా లొకేషన్ లో కార్తీ, త్రిష మీద జరిగింది. ఇందులో భాగంగానే ఓ గుడిలోను షూట్ చేశారట. త్రిష చేసిన పూజలన్ని సినిమా కోసమేనని.. పెళ్లి కోసం అసలు కాదని ఆమె పీఆర్ఓ టీం క్లారిటీ ఇచ్చారు.