NTR : గోవాకి ఎన్టీఆర్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
ఎన్టీఆర్ కొద్దీ రోజుల్లో గోవాకి ప్రయాణం అవ్వబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ గోవా ప్రయాణం వెనుక ఉన్న కారణం ఏంటి..?

Devara movie star NTR off to goa for what
NTR : ఆర్ఆర్ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇంటర్నేషనల్ వైడ్ మారుమోగిపోయింది. ఇక ఇటీవల ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ ని అకాడమీ ఎంపిక చేయడంతో తారక్ పేరు మరోసారి రీ సౌండ్ వచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతూ, వాటి షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ఎన్టీఆర్ కొద్దీ రోజుల్లో గోవాకి ప్రయాణం అవ్వబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ గోవా ప్రయాణం వెనుక ఉన్న కారణం ఏంటి..?
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వరుస షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ దేవరని పరుగులు పెట్టిస్తున్నాడు. మొన్నటి వరకు హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు న్యూ షెడ్యూల్ కోసం గోవా వెళ్ళబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం.
Also read : Anil Kapoor : తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులన్నీ డిలీట్ చేసిన ఆ నటుడు.. ఎందుకంటే?
కాగా ఈ సినిమా రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు రాబోతుందంటూ ఇటీవల దర్శకుడు కొరటాల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని ముందుగా అనౌన్స్ చేసినట్లు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకు జరుగనుందని సమాచారం.
ఇక ఈ చిత్రంతో ఎన్టీఆర్.. వార్ 2, NTR30 సినిమాల్లో కూడా నటించనున్నాడు. వార్ 2 చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోయే NTR30 వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలు కానుందని తెలియజేశారు నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి పై అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఎంతో ఆసక్తి నెలకుంది.