Dimple Hayathi : డింపుల్ హయతి బయటకు రావడానికి భయపడుతుంది.. డింపుల్ కి ప్రాణహాని ఉంది.. లాయర్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా డింపుల్ హయతి లాయర్ మరోసారి మీడియాతో మాట్లాడారు. డింపుల్ లాయర్ పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..

Dimple Hayathi Advocate satyanarayana speak with Media about issue with DCP Rahul
Dimple Hayathi Advocate : రెండు రోజులుగా హీరోయిన్ డింపుల్ హయతి వార్తల్లో నిలిచింది. తన అపార్ట్మెంట్స్ లోనే నివసించే హైదరాబాద్ ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డేతో పార్కింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా గొడవ పడుతుంది డింపుల్. ఈ నేపథ్యంలో DCP వాడే ప్రభుత్వ కారుని తన్నింది అని, కారుతో ఢీ కొట్టిందని DCP డ్రైవర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్, ఆమె బాయ్ ఫ్రెండ్ పై కేసు నమోదు చేశారు.
అయితే డింపుల్ ది తప్పేమి లేదని, DCP నే తనతో ర్యాష్ గా మాట్లాడాడని డింపుల్ కేసు పెట్టబోతే పోలీసులు తీసుకోలేదు. దీంతో సెటైరికల్ గా పోలీసులపై ట్వీట్ చేసి న్యాయపరంగానే వెళ్తామని తన లాయర్ తో మాట్లాడించింది. ఆల్రెడీ డింపుల్ లాయర్.. DCP కావాలని చేస్తున్నారని, డింపుల్ ని వేధిస్తున్నారని, కేసు పెడితే పోలీసులు తీసుకోవట్లేదని, తప్పంతా తనవైపు ఉంచుకొని ఒక సెలబ్రిటిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
తాజాగా డింపుల్ హయతి లాయర్ మరోసారి మీడియాతో మాట్లాడారు. డింపుల్ లాయర్ పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. డింపుల్ పై తప్పుడు ఫిర్యాదు చేశారు. డీసీపీ కార్ కవర్ తీసేశారు అని FIRలో పెట్టారు. డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ బయట పెట్టండి. డీసీపీ అబద్దాలు ఆడుతున్నాడు. తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నాడు. డ్రైవర్ ఎందుకు బయటకు రావడం లేదు. ట్రాఫిక్ పోలీసులు బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్ లో పెట్టారు. తప్పును కవర్ చేసేందుకు ఇదంతా చేస్తున్నారు. గవర్నమెంట్ కార్ కు ఎవరూ కవర్ పెట్టరు. డీసీపీ బిహేవియర్ బాగాలేకనే డింపుల్ గతంలో వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా తట్టుకోలేకనే తప్పుడు కేసు పెట్టారు. డీసీపీ బాధ్యత తగ్గట్టు పని చేయడం లేదు. ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. 41a section కింద కేసు ఉంది అని అన్నారు.
Sudhakar : కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.. తనపై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇస్తూ..
అలాగే లాయర్ పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్కింగ్ వివాదం తర్వాత నటి డింపుల్ హయతికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ చేస్తున్నారు. నిన్న హీరోయిన్ ఇంట్లోకి ఫ్యాన్స్ అంటూ ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు. దీనిపై 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాం. బయటకు వెళ్ళడానికి డింపుల్ భయపడుతుంది. వివిధ నంబర్ల నుండి కాల్స్ వస్తునాయి. డీసీపీ, అతని డ్రైవర్ పైన న్యాయ పరమైన యాక్షన్ తీసుకుంటాం. డింపుల్ కంప్లైంట్ పెడితే పోలీసులు మాత్రం తీసుకోవడం లేదు అని తెలిపారు. దీంతో డింపుల్, డీసీపీ వివాదం మరింత ముదురుతోంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ వివాదంపై డీసీపీ రాహుల్ స్పందించకపోవడం గమనార్హం.