Krithi Shetty : కృతిశెట్టిపై డైరెక్టర్ ఫైర్..?
నటి కృతిశెట్టిపై దర్శకుడు లింగుస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కృతిశెట్టి నటిస్తున్నారు. ఓ సీన్ చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ కి చిర్రెత్తించారట కృతి. గంటపాటు చేసినా దర్శకుడు అనుకున్నట్లు సీన్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Krithi Shetty
Krithi Shetty : తొలిసినిమాతోనే కుర్రకారు మనసు దోచిన నటి కృతిశెట్టి. తన అందచందాలతో కుర్రకారు హృదయాలు గెలిచారు ఈ భామ. ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతిశెట్టి.. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. ఈ విజయంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రంలో కృతి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం హీరోయిన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కృతిశెట్టిపై డైరెక్టర్ లింగుస్వామి ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తుంది.
నాజర్, కృతిశెట్టిలపై ఓ ఎమోషనల్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆమె భావోద్వేగాలు పండించడంలో విఫమైనట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గంటపాటు సేపు ప్రయత్నించినా డైరెక్టర్ అనుకున్నట్లుగా ఆ సీన్ రాలేదట.. దీంతో నాజర్ అసహనానికి గురయ్యారని టాక్.. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ లింగుస్వామి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, ఆది పినిశెట్టి, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.