Kalki 2898AD : ‘కల్కి 2898AD’ సినిమా మహాభారతం నుంచి మొదలయి.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898AD సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు.

Kalki 2898AD : ‘కల్కి 2898AD’ సినిమా మహాభారతం నుంచి మొదలయి.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..

Director Nag Ashwin Reveals Prabhas Kalki 2898AD Movie Story Line

Updated On : February 26, 2024 / 8:33 AM IST

Kalki 2898AD Movie : ప్రభాస్(Prabhas) సలార్ బిగ్ సక్సెస్ తర్వాత ‘కల్కి 2898AD’ లాంటి హాలీవుడ్ రేంజ్ భారీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మే 9 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో భవిష్యత్తు, గతం.. సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ కి వెళ్లగా అక్కడ మాట్లాడుతూ కల్కి సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి 2898AD సినిమా మహాభారతం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాము. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా సినిమా తీస్తున్నాము. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేసాము అని తెలిపారు. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Divi Vadthya : బిగ్‌బాస్ ఫేమ్ దివి లవ్, బ్రేకప్ స్టోరీ తెలుసా? అతను చనిపోవడంతో అంటూ ఎమోషనల్ అయి..

ఇక కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ విల‌న్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.