Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్.. ఇంకా షూట్ ఉంది.. ఇప్పట్లో రిలీజ్ లేనట్టే..

గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం చరణ్ అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు.

Game Changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్.. ఇంకా షూట్ ఉంది.. ఇప్పట్లో రిలీజ్ లేనట్టే..

Director Shankar Update on Game Changer Movie

Game Changer : రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా సరైన అప్డేట్స్ లేవు. ఒక్క సాంగ్ మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ షూట్ ఇంకా జరుగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం చరణ్ అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. రిలీజ్ ఎప్పుడంటే మూవీ టీమ్ ఎవరూ మాట్లాడట్లేదు. పోనీ అప్డేట్ ఇమ్మని అడుగుతున్నా సైలెంట్ గానే ఉంటున్నారు.

గతంలో నిర్మాతలు ఏదో ప్రెస్ మీట్ లో చెప్తూ సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అభిమానులకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవల కూడా రాజమండ్రిలో ఓ షూటింగ్ షెడ్యూల్ చేసొచ్చారు. అయితే తాజాగా డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడారు.

Also Read : Raghu Rama Krishna Raju : భీమవరంలో కల్కి సెలబ్రేషన్స్.. ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు హడావిడి మాములుగా లేదుగా..

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ షూట్ ఇంకా 10 నుంచి 15 రోజుల షూట్ మిగిలే ఉంది. త్వరలోనే ఆ షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది. అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వాలి. అప్పుడు రిలీజ్ డేట్ లాక్ చేస్తాం అని తెలిపాడు. దీంతో ఏ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదు, అసలు ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా అని రామ్ చరణ్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు వస్తుందో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుకే తెలియాలి.