Varun Tej : వరుణ్ తేజ్ అసలు పేరేంటో తెలుసా? పాస్ పోర్ట్, ఆధార్‌లో ఆ పేరే ఉంటుంది అంట

'ఆపరేషన్ వాలంటైన్' మూవీ మార్చి 1న రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Varun Tej : వరుణ్ తేజ్ అసలు పేరేంటో తెలుసా? పాస్ పోర్ట్, ఆధార్‌లో ఆ పేరే ఉంటుంది అంట

Varun Tej

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాతో మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శక్తిప్రతాప్ సింగ్ హడా ఈ మూవీని డైరెక్ట్ చేసారు. రీసెంట్‌గా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Darshan : ఆ హీరోపై కేసు పెట్టిన 35 మంది మహిళలు.. చిక్కుల్లో స్టార్ హీరో

వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మార్చి 1న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.

Bhimaa Trailer : గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ ‘భీమా’ ట్రైలర్ వచ్చేసింది..

వరుణ్ తేజ్ అసలు పేరు ‘సాయి వరుణ్ తేజ్’ అట. స్క్రీన్ మీద పెద్దదిగా ఉంటుందని సాయిని తీసేసారట. పాస్‌పోర్టులో అన్ని సర్టిఫికేట్స్‌లో ‘సాయి వరుణ్ తేజ్’ అని ఉంటుందట. వరుణ్ తేజ్ హైట్ 194 సెంటీమీటర్లు.. అంటే 6 అడుగుల 4 అంగుళాలు. షూటింగ్స్ టైమ్‌లో హీరోయిన్స్ పక్కన నటిస్తున్నప్పుడు వాళ్ల హైట్‌కి కాస్త అడ్జస్ట్ అయి నటించాల్సి వస్తుందని వరుణ్ చెప్పారు. వరుణ్‌కి టాటూ అంటే ఇష్టమే కానీ.. వేయించుకోవడమే భయమట. తప్పకుండా వేయించుకునే ఆలోచన అయితే ఉందట. ఇక తన ప్రతి సినిమాకి ఎంతో కొంత అని ఫిక్స్డ్ అమౌంట్ రెమ్యునరేషన్ తీసుకోరట.. బడ్జెట్ బట్టి ఛార్జ్ చేస్తారట. ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రమోషన్స్ పూర్తి కాగానే వరుణ్ తన నెక్ట్స్ మూవీ మట్కా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీని కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. నోరా ఫతేహా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.