NBK : దీపావళికి బాలయ్య డబుల్ ధమాకా
ఈ దీపావళికి బాలయ్య తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు..
Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ దీపావళి నాడు తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. రెండు క్రేజీ అప్డేట్లతో నందమూరి అభిమానుల దీపావళి సంబరాలను డబుల్, ట్రిపుల్ చెయ్యబోతున్నారు.
BalaKrishna: కేర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణకి సర్జరీ
నటుడిగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాలయ్య ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. ఇప్పుడు ‘ఆహా’ ‘అన్‌స్టాపబుల్’ షో తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. దీపావళి నుండి ఈ షో ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అందరూ ‘ఆహా’ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు.
‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ సూపర్‌హిట్ సినిమాల తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’.
Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’
దీపావళి స్పెషల్‌గా నవంబర్ 4 ఉదయం 11:43 గంటలకు ‘అఖండ’ టైటిల్ సాంగ్ టీజర్ రోర్ పేరుతో వీడియో విడుదల చెయ్యనున్నారు. 8వ తేదీ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇలా సినిమా, డిజిటల్ రెండు అప్డేట్లతో సోషల్ మీడియాలో సందడి చెయ్యబోతున్నారు బాలయ్య బాబు.