బాలకృష్ణకు అంకితం.. నన్ను చంపేసినా

లక్ష్మీ’స్ ఎన్టీయార్ సినిమా ప్రమోషన్‌లు మొదలెట్టిన రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను సంచలనాల కోసం మాత్రమే సినిమాలు తీయడం లేదు. బయోపిక్ గురించి తొలిసారి బాలకృష్ణగారు వచ్చినపుడు ఈ కథ మీద దృష్టి కేంద్రీకరించాను.
ఈ కథలో చాలా విషయం ఉందని అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే నేను లక్ష్మీ`స్ ఎన్టీయార్ తీయడానికి బాలయ్యే స్ఫూర్తి అనవచ్చు. ఈ సినిమా ఆయనకే అంకితం అంటూ ఆయన ప్రకటించాడు. ఒకవేళ ఈ సినిమాను బాలకృష్ణతో తీసినా కూడా వెన్నుపోటు అంశాన్ని తీయడంలో కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు అంటూ ప్రకటించారు.
అలాగే ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో అనేక బెదిరింపులు వచ్చాయని, అయితే తనను బెదిరించినా కూడా ఈ సినిమాను నిజం చెప్పేందుకే తీశానని వెల్లడించారు. తనను ఒకవేళ చంపినా సినిమా విడుదల అవుతుందని చెప్పారు. ‘ఓ హార్డ్ డిస్క్‌లో రష్ అంతా ఉంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయాలని చీటీ రాసిపెట్టాను. అందువల్ల దీనిని బయటకు రాకుండా ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22వ తేదీన విడుదల కానుంది.