GAMA Awards : ‘గామా’ అవార్డ్స్ 5వ ఎడిషన్ ఎప్పుడు? ఎక్కడ? భారీగా హాజరవుతున్న టాలీవుడ్ సెలబ్రిటీలు..

గామా అవార్డ్స్ ఇప్పటికే నాలుగు ఎడిషన్లు జరగగా తాజాగా 5వ ఎడిషన్ ని ప్రకటించారు.

GAMA Awards : ‘గామా’ అవార్డ్స్ 5వ ఎడిషన్ ఎప్పుడు? ఎక్కడ? భారీగా హాజరవుతున్న టాలీవుడ్ సెలబ్రిటీలు..

GAMA Awards 5th Edition Launched Event Details

Updated On : June 24, 2025 / 4:11 PM IST

GAMA Awards : ప్రతిష్టాత్మమైన గామా(Gulf Academy Movie Awards)అవార్డ్స్ ఇప్పటికే నాలుగు ఎడిషన్లు జరగగా తాజాగా 5వ ఎడిషన్ ని ప్రకటించారు. తాజాగా దుబాయ్ లో జరిగిన Keinfra ప్రాపర్టీస్ ప్రారంభిత్సవంగా గామా 5వ ఎడిషన్ ప్రెస్ మీట్ నిర్వహించి, థీమ్ సాంగ్ లాంచ్ చేసారు.

గామా అవార్డు 5వ ఎడిషన్ వేడుకలు 2025 ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. టాలీవుడ్ లోని 24 క్రాఫ్ట్స్ కు ఈ అవార్డ్స్ అందించనున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో నామినేట్ అయిన విభాగాలకు జ్యురి ద్వారా, పబ్లిక్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా అవార్డులను సెలెక్ట్ చేయనున్నట్టు తెలిపారు.

Also Read : Mukesh Kumar Singh : రాజమౌళి, అమీర్ ఖాన్ కి పోటీగా ‘కన్నప్ప’ డైరెక్టర్.. వర్కౌట్ అవుతుందా?

గామా అవార్డ్స్ 2025 కు సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి, బి. గోపాల్, సంగీత దర్శకులు కోటి పలువురు జ్యూరీ చైర్ పర్సన్స్ గా ఉండనున్నారు. ఈ గామా అవార్డుల వేడుకకు టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నగర్కర్, బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవ్వనున్నారు. ఈ ఈవెంట్లో హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే.. పలువురు స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.

Gama Awards

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ కేసరి మాట్లాడుతూ.. టాలీవుడ్ అవార్డులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించనున్నాం. షార్జా ఎక్స్‌పో సెంటర్లో 10 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు.

Also Read : Nagababu : అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది.. అవన్నీ తప్పుడు వార్తలు.. నాగబాబు క్లారిటీ..