Game Changer : గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ రివీల్ చేసిన దిల్ రాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చెర్రీ అభిమానులకు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా ఎప్పుడు రాబోతుందో రివీల్ చేశారు.

Game Changer
Game Changer : రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కోసం ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత దిల్ రాజు రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.
RGV Vyooham: వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్లో మంత్రులు రోజా, అంబటి, జోగి రమేశ్ ఏమన్నారో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుండి కేవలం టైటిల్ గ్లింప్స్ తప్ప ఎటువంటి అప్ డేట్ లేదు. డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే గేమ్ ఛేంజర్ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి చెర్రీ అభిమానులు మాత్రం గరం అవుతున్నారు.
Salaar Affect : PVRపై సలార్ రిలీజ్ ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన షేర్లు
గేమ్ ఛేంజర్ నుండి ఎటువంటి అప్ డేట్ లేకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది. తాజాగా దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ 2024 సెప్టెంబర్‌లో ఉంటుందని కన్ఫామ్ చేశారు. సలార్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన దిల్ రాజుని అభిమానులు ప్రశ్నించడంతో దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వాని, అంజలి, శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
View this post on Instagram