హ్యాపీ బర్త్ డే పూరీ జగన్నాథ్

ఒక సారి ఓషో.. పూరీ ఎదురుపడితే
పుడుతూనే ఉయ్యాల పాట వినిపిస్తాడు
సచ్చేకే మొయ్యాల ఈలోగా ఏదో సెయ్యాల
అని అనిపిస్తాడు.. అంతా మట్టి ఓట్టి మట్టి అని
నిర్వచనం ఇస్తాడు దేహానికి సంబంధించి
ఈశ్వరుడు నోరిచ్చాడు జీవితాన్నిచ్చాడు
అంతకుమించి గొప్ప రచయిత గుడిపాటి వెంకటా చలాన్ని ఇచ్చాడు
అంతకుమించిన చలనాన్ని ఇచ్చాడు
వీటన్నింటికీ ప్రతినిధి వాడు.. ఒక్కో సారి ఏక్ నిరంజన్ వాడు
చావు దాకా వెళ్లొచ్చి చచ్చేంత కోపమొచ్చి చచ్చాక సాధించేదేంటన్న ఆలోచన వచ్చి.. దిగమింగుకున్న బాధ దగ్గర ఉప్పెన వాడు.. మోసం.. ద్రోహం వీటిని ఎందాక అంచనా వేయలో తెలియని వాడు కూడా వాడే.. మీ సమయం వచ్చే దాకా ఫ్లాట్ ఫాంపై వేచి ఉండాలి.. మీదైన గమనం సాగించి పోవాలి.. లేదంటే రైలు వెళ్లి పోతుంది మీరున్నా లేకున్నా అని అంటాడు వాడు.అన్నింటినీ భ రిస్తాడు వాడు.. దుఃఖాన్ని నవ్వుతో భర్తీ చేస్తాడు వాడు.. మావోడే.. మా ఉత్తరాంధ్రుడే.. నర్సీపట్నపోడే..
రోగం వస్తే అది నాకు చెడు రోగ కారక క్రిములకు అది మంచి అంటూ ఓ ఉదాహరణ చెబుతాడు ఓ సందర్భంలో ఓషో.. అలానే నీ మంచి/నీ చెడు ఈ రెండు స్థల కాలాదుల్లో మారిపోతాయి.కోట్లు పోగొట్టుకున్ననాడు ఇతరుల కన్నా అయినవారికే ఎక్కువ చెడు ..సొమ్ములు పోగేసుకుంటున్నప్పుడు..ఇండస్ట్రీకో మరుపురాని విజయాలు ఇచ్చినప్పుడు ఆ స్వర్గాల చెంత ఆ స్వరాల చెంత వా డు పర కాదు పరకా కాదు మన..మనకు తెలిసినంత మంచి.. మనం రెట్టించి రెట్టించి ప్రశంసించిన మంచి..ఊగించి,తూగించిన మంచి.. తూకాలకు సైతం అందనంతం మంచి..అందుకే అంటాడు భయం వేస్తుంది సర్ ఈ మనుషుల మధ్య ఉండాలంటేనే.. ఒక్కోసారి అన్నింటినీ వదిలిపోవడమే ఉత్తమం అనిపిస్తుంది కూడా!
ఏదేమైనా..సాధించి తీరాలి అన్న ఆలోచన దగ్గర విషం ఉన్నా అది అమృతంగా మార్చే లక్షణం ఒకటి వెంటబెట్టుకుని తీరాలి అని అనుకునే సందర్బాన మనలో మనకు నచ్చిన టెంపర్.. పొగరు..కచ్చితంగా వాడే.. ఆ పోరడే.. ఆ దేశముదురునే.. హాహాహా.. ఇలా అంటే నవ్వుతాడేంటో.. సో.. దేవుడు నీలో మంచి దెయ్యం అతనిలో చెడు…ఇలా చెప్పడం సులువు.. జీవితాన్ని అర్థం చేసుకోవడం కష్టం.ఈ రంగుల ప్రపంచంలో డబ్బలు ఎగ్గొట్టి పోయిన వా రు..అసలు సిసలు మోసకారులు అంతా తెర వెనుకా తెర ముందూ ఉంటూనే ఉంటారు. వారి నటనను భరించడమే అత్యంత కష్టం.
అవునండి! నా వరకూ సక్సెస్‌లు లేని రోజు ఎవ్వరయినా పిలిచి పరమాన్నం వడ్డిస్తారా చెప్పండి అని నవ్వుతూనే లోక రీతి చె బుతాడు.అవకాశాలు లేవనో రాకనో మథన పడే వారికో అండగా నిలిచేందుకు తనకు తాను ముం దుంటాడు.రూపాయలన్నీ అబ ద్ధాలే చెబుతాయి కదా! మరి వీడేంటి సంపాదించిన రూపాయలకో విలువ ఆపాదిస్తూ.. నిజ స్ఫూ ర్తిని చాటుతున్నాడు అని అను కుంటే అది కూడా చిన్న సాయమే కదండి..నా వరకూ నేను అనుకున్నంత.. నేను పంచదగినం త..అవును!ఇంతకుమించి ఏమీ చెప్పడు..మనమే ఆ నవ్వుల్లో పదాల అర్థాలనో సోయగాలనో వెతుక్కోవాలి. హ్యాపీ బర్త్ డే పూరీ సార్..
– రత్నకిషోర్ శంభుమహంతి, శ్రీకాకుళం.