Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు చిత్రానికి U/A సర్టిఫికెట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్..

ట్రైలర్ విడుదలైన తర్వాత 'హరి హర వీరమల్లు'పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు చిత్రానికి U/A సర్టిఫికెట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్..

Updated On : July 14, 2025 / 4:28 PM IST

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియడ్ యాక్షన్ చిత్రం హరి హర వీరమల్లు (పార్ట్ 1-స్వార్డ్ vs స్పిరిట్) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ ను పొందింది.

17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి నటించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు.

ట్రైలర్ విడుదలైన తర్వాత ‘హరి హర వీరమల్లు’పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ‘హరి హర వీరమల్లు’ చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలు. సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన కథనాన్ని, భారీ విజువల్స్ సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించారు.

వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..
జూలై 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా అసలుసిసలైన పాన్-ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. USAలో ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ సేల్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యాక్షన్, డ్రామా, భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ చరిత్రాత్మక గాథను వెండితెరపై చూడటానికి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Also Read: ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘కె-ర్యాంప్’ గ్లింప్స్‌..

ఒక్క USAలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ‘హరి హర వీరమల్లు’ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడి.. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మించారు.