అనుకున్నదే అయ్యింది – నితిన్ పెళ్లి వాయిదా.. పుట్టినరోజు కూడా..
కరోనా ఎఫెక్ట్ : యంగ్ హీరో నితిన్ తన పెళ్లితో పాటు పుట్టినరోజు వేడుకలను కూడా రద్దు చేసుకోనున్నట్టు ప్రకటించాడు..

కరోనా ఎఫెక్ట్ : యంగ్ హీరో నితిన్ తన పెళ్లితో పాటు పుట్టినరోజు వేడుకలను కూడా రద్దు చేసుకోనున్నట్టు ప్రకటించాడు..
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పాజిటివ్ కేసులతోపాటు, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు గుమిగూడవద్దని, ఎటువంటి వేడుకలు ఉన్నా వాయిదా వేసుకోమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్న తరుణంలో హీరో నితిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అంతేకాదు మార్చి 30న తన బర్త్‌డే సందర్భంగా అభిమానులెవరు వేడుకలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఓ లెటర్‌ను విడుదల చేశారు.
‘‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్నీ ఆశించే మీ.. నితిన్..’’ అంటూ నితిన్ తన లెటర్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న షాలినితో నితిన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోబోతున్నాడని గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.