Naga Chaitanya-Shobhita Dhulipala : నాగచైతన్య, శోభితల పెళ్లి అక్కడేనా..?
టాలీవుడ్ నటి సమంతతో విడాకుల అనంతరం హీరో అక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు.

Is Naga Chaitanya Shobhita Dhulipala have a destination wedding Plans
Naga Chaitanya-Shobhita Dhulipala : టాలీవుడ్ నటి సమంతతో విడాకుల అనంతరం హీరో అక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరు ఆగస్టు 8న హైదరాబాద్‌లోని అక్కినేని నాగార్జున నివాసంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది.
ఇక చైతు, శోభితల పెళ్లి ఎప్పుడు అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరి వివాహం ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. చైతన్య తన రెండో వివాహాన్ని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడట. రాజస్థాన్ లోని ఓ రిసార్ట్‌లో నాగచైతన్య, శోభిత ధూళిపాళల ఎంతో ఘనంగా జరగనుందని టాక్.
నాగ చైతన్య గతంలో సమంతను గోవాలో 2017లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక బంధం మూడున్నరేళ్ల పాటు మాత్రమే కొనసాగింది. 2021 లో ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శ్రీకాకుళంలో జరుగుతోంది.
Imanvi : ప్రభాస్ పక్కన కొత్త అమ్మాయి ఇమాన్వి.. ఎందుకు తీసుకున్నాడో చెప్పిన హను రాఘవపూడి..