Ram Gopal Varma: ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందా? నాకు భయంతో జ్వరం వచ్చేసింది!

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ ప్రోగ్రామ్‌పై వరుస ట్వీట్లు చేశారు.

Ram Gopal Varma: ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందా? నాకు భయంతో జ్వరం వచ్చేసింది!

Ram Gopal Varma

Updated On : February 3, 2022 / 9:24 PM IST

Ram Gopal Varma: సినిమా టిక్కెట్ల వ్యవహారం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తున్న సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ ప్రోగ్రామ్‌పై వరుస ట్వీట్లు చేశారు.

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది.” అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

మరో ట్వీట్‌లో “ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నన్ను షాక్‌కి గురిచేసింది. ఇటువంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అనేది నా సందేహం.” అని అన్నారు.