జాక్‌పాట్- ఫస్ట్ లుక్

రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న మూవీకి 'జాక్‌పాట్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 05:36 AM IST
జాక్‌పాట్- ఫస్ట్ లుక్

Updated On : May 1, 2019 / 5:36 AM IST

రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న మూవీకి ‘జాక్‌పాట్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

ఒకప్పడు తెలుగు, తమిళ్‌‌లో కథానాయికలుగా రాణించిన రేవతి, జ్యోతిక ఇద్దరూ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. గులేబకావళి (2018) ఫేమ్ ఎస్.కళ్యాణ్ దర్శకత్వంలో రేవతి, జ్యోతిక మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న మూవీకి ‘జాక్‌పాట్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రేవతి, జ్యోతిక ఇద్దరూ ఖాకీ డ్రెస్‌లో ఉన్నారు. స్టైల్‌గా గాగుల్స్ పెట్టుకుని, స్మైల్‌తో స్టిల్ ఇచ్చారు.

మరో పోస్టర్‌లో జ్యోతిక జీప్ బానెట్‌పై నడుముకి చేతులు పెట్టుకుని నిలబడింది. ఈ సినిమాకోసం రేవతి, జ్యోతిక బైక్స్ నడపడం విశేషం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న జాక్‌పాట్ షూటింగ్‌ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేసేసారు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో యోగిబాబు, మన్సూర్ అలీ, ఆనంద్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : విశాల్ చంద్రశేఖర్, కెమెరా : ఆనంద్ కుమార్.